పుట:కాశీమజిలీకథలు-05.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

35

గీ. అతని మాటల వినిన వాఁ డమృతమేవ
    గించు భోగములఁ దృణీకరించుఁ ద్రుంచుఁ
    జిత్తమోహంబులను విమర్శించు శ్రుతుల
    మించు జనకాదియతుల భూమికళత్ర.

క. ఆ మహితాత్మునిగనుఁగొనఁ
   గామదిఁ గామితమునీకుఁ గలిగిన యేనిన్
   భూమీశ! రమ్ము పోవుద
   మామహికననలయాతఁ డతివేగముగాన్.

వ. చతురంగబలపరివృతుండై యయ్యగ్రహారంబునకుంజని యందు.

సీ. క్షితిసురార్భకులచే సేవింపఁబడువాని
             ధవళయజ్ఞోపవీతములవాని
    గంగాతరంగిణీ కమనీయహిమమహీ
            ధరముతోనెనయింపఁ దగినవాని
    శరదంబుధరనిభాంబరముదాల్చిన వాని
            ఘనమృగాజినముమైఁ గప్పికొనుట
    నీలాంబరునిబోలు మేలిరూపమువాని
            మంచికృత్యములాచరించువాని.

గీ. మిసిమి మేలిపసిండి క్రొమ్మించులీను
    మౌంజికటిసీమవింత సంపదఘటింపఁ
    బీతల కావృతద్యుతిభూ జాతమట్లు
    మురువుఁజెందెడు వాని శంకరునిఁ గనియె.

వ. కనుంగొని మనంబునఁ దదీయ మహానుభావతకు విస్మయముఁ జెందుచు నానృపాలుండా బాలునకనేక సాష్టాంగ నమస్కారములు గావించినంజూచి శంకరుం డతని మన్నించుచు నాశ్వీరచన పూర్వకముగా నాగమన కారణంబడిగెను. అప్పుడు పదివేలదీనారము లతని మ్రోల బ్రోగువెట్టి యానృపతి యల్లన నిట్లనియె. మహాత్మా! నేనతి ప్రయత్నముతో మూఁడునాటకములఁ గావించితిని. వాని విమర్శించి గుణదోష వివేచనము గావింపవలయును. ఇదియే మదీయ వాంఛితమని పలికి యతని యనుమతి వడసి యా మూఁడునాటకములను సంగ్రహముగాఁ జదివి వినిపించెను.

రసపూరితములై, మనోహరగుణరీతి విశిష్టములై యొప్పు నా నాటకముల మూఁటిని విని శంకరుఁడు సుస్మితాంకురములు మోము నలంకరింప నృపాలా! నీ నాటకములు నిర్దుష్టములై సుకవిజనస్తోత్ర పాత్రములై యున్నవని మెప్పువచ్చె. నీ యభీష