పుట:కాశీమజిలీకథలు-05.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

278

కాశీమజిలీకథలు - ఐదవభాగము

తర్వాతివృత్తాంతము విస్తారముగా నున్నయది కావున ముందటి మజిలీలో దర్వాతికథ జెప్పెద నిప్పుడు లేచి కట్టెలం దెమ్ము. వంటఁజేసికొని భుజింతమని పలికి యెట్టకేలకు వాని సమాధానపరచి యట్లు కావించెను.

మరియు నయ్యతీశ్వరుని వెంట గావడి మోచుకొని నడచుచు వాఁడు నడుమ నడుమ అయ్యా! అమ్మహాశ్వేతతోఁ బుండరీకుఁడు వెండియు గలిసికొనునా? చంద్రాపీడుఁడు తరువాత నేమి చేసెను? ఎచ్చటికి బోయెను? ఏమి జరిగినది? అని యడుగుచుండ హస్తసంజ్ఞచే వారింపుచు నెట్టకేలకా పారికాంక్ష తరువాత మజిలీ చేరి తదనంతరోదంత మిట్లెరింగించెను.


శ్రీరస్తు

కాశీమజిలీకథలు

కాదంబరి కథ

అట్లు సాయంకాలమగుటయు మహాశ్వేత మెల్లగా లేచి పశ్చిమసంజ నుఁపాసించుచుఁ గమండలు జలంబులఁ బాదములఁ గడిగికొని వల్కలతల్పమున నతికష్టముగా గూర్చుండెను.

చంద్రాపీడుండును సంధ్యాప్రణామములు గావించి రెండవశిలాతలమున మృదులతాపల్లవములచేత శయ్య గల్పించుకొని కూర్చుండి యమ్మహాశ్వేతవృత్తాంతమునే పలుమారు తలంచుకొనుచు మన్మథప్రభావమునకు వెరగుపడుచు వినయముతో వెండియు నామె కిట్లనియె.

భగవతీ! వనవాసవ్యసనమిత్ర మగు నీ పరిచారిక తరళిక యెందు బోయినది? అని యడుగుటయు నా సాధ్వి మహాభాగా! చెప్పెద వినుము. గంధర్వకులనాయకుఁడగు చిత్రరథుని ప్రసిద్ది మీరు వినియుందురు. అతనికిఁ గాదంబరి యను కూఁతురు కలదు. అబ్బాలిక నాకు రెండవ హృదయము వంటిది. పిన్ననాటినుండియు నశనపానశయనాదు లేకముగానే మా యిరువురకు జరిగినవి. శిశుక్రీడలును నృత్య