పుట:కాశీమజిలీకథలు-05.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

273

రత్వము వహించి యున్నదో లేదో నిదానింపుము. అని మఱియుం బెక్కుతెరంగులఁ దత్కాలోచితముగా నర్మసంభాషణములఁ గావింపుచుఁ గ్రమంబునఁ దత్ప్రదేశమునుఁ జేరితిమి.

అట్టి సమయమున నాసరోవరము పశ్చిమతీరంబున దవ్వగుటచే ననతివ్యక్తముగాఁ పురుషరోదనధ్వని యొకటి వినంబడినది. కుడిక న్నదరినది మొదలు శంకించుచున్న నాహృదయ మాధ్వని వినినంత మిక్కిలి తొట్రుపడుచుండ, తరళికా? యిది యేమని వెరపుతో బలుకుచు మేను గంపమునొంద నతిత్వరితముగా దదభిముఖముగాఁ బోయితిమి.

ఆ సమయము నిశ్శబ్దముగా నుండుటచే దూరమయినను మరియు నాధ్వని యిట్లు విననయ్యె.

హా! పుండరీక? హా! ప్రాణమిత్ర! హా! మహాభాగ! మన్మథహతకుఁడు నీ కెట్టి యుపద్రవము సంఘటించెనురా! అన్నన్నా! దుర్వినీతయగు మహాశ్వేత మూలముననేకదా? యింత పుట్టినది. కటకటా! శ్వేతకేతున కెంత వచ్చినది? ధర్మమా! నిన్నిఁకఁ నెవ్వరు స్వీకరింతురు? తపంబా! ఇఁక నీ కాశ్రయ మెవ్వరు? సరస్వతీ? విధవవైతివే? సత్యమా! ని న్ననాథఁగా దలంచెదను. మీయాశ్రయుం డన్యలోకమునకుఁ బోయె. అయ్యో! మిత్రమా? నన్నుఁ జూడవేమి? నన్ను విడిచి యొక నిమిషమయిన నుండగలవా? నన్ను విడిచిపోవుట నీకు న్యాయమా? యొక్కసారి మాట్లాడుము. నాకు మిక్కిలి వేడుకగానున్నది. ఇఁక నేనెక్కడికిఁ పోవుదును? ఎవ్వరితో దిరుగుదును? నా యందుగల సుహృత్స్నేహమంతయు నెందుబోయినది? ఎప్పుడును నవ్వుచునే మాట్లాడువాఁడవే. అ ప్రజ్ఞయంతయు నెందుబోయినది? అయ్యయ్యో అక్కటా! హా! హా! అని యీరీతి గపింజలుఁడు విలపించుచున్నట్లు వినంబడినది.

అప్పుడు నాకుఁ బ్రాణములు పోయినట్లేయైనవి. ప్రయత్నముతో నడచుచున్నను నిమ్నోన్నతముల నరయలేక అడుగులు తడఁబడుచుండ నెవ్వడో బలాత్కారముగాఁ దీసికొని పోవున ట్లెట్టకేల కాప్రదేశము జేరి మణిశిలాతలంబున వనకుసుమములచే విరచింపఁబడయున్న శయ్యయందు దీర్ఘనిద్రాముద్రితసయనుండై చందనరసచర్చితమగు నవయవముల మృణాళనాళముల నలంకారములుగా ధరియించి మన్మథవ్యధ సహింపజాలక నిశ్చేతనుండై సుఖించుచున్నట్లు అపూర్వప్రాణాయోగం బభ్యసించుచున్నట్లు అనంగయోగవిద్య నవధరించుచున్నట్లు విగతజీవితుండయినను దేజంబు దప్పక పడియున్న పుండరీకుని మహాపాపాత్మురాలనగు నేఁను జూచితిని.

కపింజలుఁడు నన్నుఁ జూచి రెట్టించిన శోకముతో నతని కంఠమును గౌఁగలించుకొని మరియు నెక్కుడుగా విలపింపఁదొడంగెను. అప్పుడు నేను మూర్ఛాంధకార