పుట:కాశీమజిలీకథలు-05.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

250

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ధన్ముఁరాలో! వీనిం భర్తగాఁ బడయఁబోవు పూవుఁబోడి యెంత తపంబు గావించినదియో? అని యంతఃపురకాంతలెల్ల స్తుతియింపుచుండఁ జిత్రగమనంబులఁ బెక్కండ్రు వారువపురౌఁతులు చుట్టును పరివేష్టించి నడుచుచుండం గ్రమంబునఁ బోయిపోయి యాస్థానసమీపముఁన కరిగి ద్వారదేశమునందే గుర్రమును దిగి వైశంపాయనుని కైదండఁ గైకొని బలాహకుఁడు వినయముతో ముందు నడచుచు దారిజూపుచుండఁ గాక్షాంతరములు గడచి కైలాసగిరివిలాసమునం బ్రకాశించు గృహసభామంటపంబు చేరంజని యందు,

సీ. కనకవేత్రములఁ గైకొని దర్పము దలిర్ప
          ద్వారపాలురు బరాబరులు సేయ
    అహిదీప్తపాతాలగుహలట్లు పొలుచు నా
          యుధశాలలను యోధు లోలగింప
    జము నోలగమున నొజ్జల వోలెఁ దగులేఖ
          కులు శాసనసహస్రములు లిఖింప
    క్షితినాథదర్శనాగతసర్వదేశభూ
          పతితతిస్తవరవార్భటులు సెలఁగ.

గీ. వేశ్య లిరువంక చామరల్ వీచుచుండ
    గవులు గాయకవందిమాగధవిదూష
    కులు భజింపఁ నిలింపయు కుఁడు మహేంద్రు
    కరణిఁ గొలువున్న ధరణీంద్రుఁ గనియె నతఁడు.

కరవినమ్రుడై నమస్కరించుచున్న పుత్రుం జూచి, తండ్రీ! రమ్ము రమ్మని చేతులు సాచుచు నానందభాష్పపూరితలోచనుండై రాజు మేనం బులక లుద్భవిల్ల పుత్రుం కౌగలించుకొనియెను.

తరువాత సుతనిర్విశేషుండగు వైశంపాయనునిం గూడ గాఢాలింగనము గావించి ముహుర్తకాలము వారిం బరీక్షించి చూచుచు, వత్సా! మీ తల్లి నిన్నుఁ జూచుటకై పరితపించుచున్నది సత్వర మామెయొద్ద కరుగుమని నియమించుటయు దండ్రికి నమస్కరించి వైశంపాయనునితోఁ గూడ విలాసవతీ యంతఃపురమున కరిగి యామెకు నమస్కరించెను.

ఆమెయుఁ తొందరగా లేచి బరిజనమున్నను తానే యవతరణమంగళకృత్యంబుల నిర్వర్తించి తదభివృద్ధి నభిలషించుచు శిరము మూర్కొని గాఢాలింగనము గావింపుచు నానందభాష్పములచే నతని శిరంబు దడిపినది. తరువాత వైశంపాయనుని గూడ నాదరించి కరతలంబునఁ గుమారుని శిరంబు దువ్వుచు, వత్సా! నీ తండ్రి కడు గర్మిష్టుఁడు సుమీ! నిన్నింతకాలము నాకుఁ గనఁబడకుండ దూరముగా నునిచి కష్టపర