పుట:కాశీమజిలీకథలు-05.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

230

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అని మణిసిద్ధుం డెరింగించుటయు గోపాలుండు పరమానంద కందళిత హృదయారవిందుఁ డై తన్ను గృతార్ధునిగా దలంచుకొనుచు నద్వైతజ్ఞానసాధనముల పరిశ్రమజేయఁ దొడంగెను.

మంగళమహా శ్రీవృత్తము

    స్వస్తియగుఁగాత బుధజాతమున కెప్పుడు ప్రజావిత భూపపతిధర్మ
    న్యస్తమతిఁబ్రోవుతఘనంబుగఘనంబు లుచితావసరమందు ననువృష్టుల్
    నిస్తులముగాఁగ భువిసించుతధరాస్థలి ఫలించుతను మంగళమహాశ్రీ
    విస్తృతగతిన్సదభివృద్ధిగాత సురభివ్రజమువత్సములతోడన్.

గీ. హవ్యవాహనగుణ వారణాంబుజారి
   సంఖ్య నొప్పారు వరశాలిశకమునందు.
   దనరుచుండు విరోధి కృద్వత్సరమున
   దీని రచియించి ప్రకటించితిని ధరిత్రి.

గద్య. ఇది శ్రీమద్విశ్వనాధపదసుకంపాసంపాదిత కవితావిచి

త్రాత్రేయముని సుత్రామగోత్ర పవిత్రమధిరకులకలశ

జలనిధిరాకాకుముదమిత్ర లక్ష్మీనారాయణ పౌత్ర

కొండయార్యపుత్ర సోమిదేవీగర్భంముక్తిముక్తా

ఫలవిబుధజనాభిరక్షిత సుబ్బన్నదీక్షితకవి.

విరచితంబగు కాశీయాత్రావసధచరి

త్రమను వచన ప్రబంధమందు

బంచమభాగమున శ్రీశంక

రాచార్య చరిత్రము

సంపూర్ణము.

శ్రీ