పుట:కాశీమజిలీకథలు-05.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

224

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అప్పుడు వారినెల్ల నాదరించి పార్వతీమహాదేవి స్వాగతపూర్వకముగా నాగమన కారణమడిగిన శచీదేవి యిట్లనియె.

దేవీ ! యిప్పుడు లోకమునకు సంభవించినయుపద్రవ మేమని మనవి చేయుదును !మేరుగిరికూటంబున జగదీశ్వరులు మువ్వురును స్వాధిక్యతగురించి కలహించి విధికృతంబుల మానివేసి విరక్తిజెంది యున్నవారట దానంజేసి.

చ. పొంమదు జంతువేదియును బుట్టిన పన్నియు సాధురక్ష జొ
    ప్పడమిసమగ్రతేజమున భాసిలరెప్పటికిన్నశింప వ
    క్కడపటికాలమంద యినఁ గాని జగంబులకిట్టియార్తి గ
    ల్లెడినెకటా ! జగత్ప్రభువులే యిటులల్గిన నేమిదక్కికన్.

సీ. ఇంద్రాదిదిక్పాలు రెల్ల వేల్పులుమునుల్
           బలహీనులై కూలఁబడిరియిండ్ల
    వర్షముల్గురియవు వారివాహంబులు
           మహియెల్ల భగ్గున మండుచుండె
    చాలినగతిమంచి గాలివీఁవదొకింత
           ప్రజ్వరిల్లదుగదా పావకంబు
    క్షుత్పిపాసలురు సంక్షోభంబుగావింప
           తెకతెకచావు పుట్టుకలులేక.

గీ. స్రుక్కుచున్నారు భూప్రజల్ జూడవమ్మ
   కలుగదిటువంటియార్తి లోకములకెపుడు
   బ్రోవఁగదమ్మ! యోయమ్మ! భువనకోటి
   పెంపుమీరఁగఁబతికి బోధింపవమ్మ.

దేవీ ! యిదియేమి మాయయోకాని పదునాలుగు జగంబులలోఁ నిపీలికాది బ్రహ్మపర్యంతము పురుషజాతియంతయు వృద్ధిక్షయములు లేక బలహీనమై కదలక మెదలక యట్టెపడియుండెను. స్త్రీజాతి మాత్రము తేజోవిలాసముగాక యధాపూర్వకముగా నొప్పుచున్నదిందులకుఁ గారణంబరసి యీ యకాండ ప్రళయము వారింపుమని యింద్రాణి శర్వాణిం బార్ధింపుచున్న సమయంబున నంతరిక్షమునుండివచ్చి యనంతదివ్యరత్న ప్రభాధగద్ధగితమై కన్నులకు మిరుమిట్లు గొలుపుచు విమానలభామం బొండయ్యండ జయానలదండ నిలువంబడినది. అవ్విమానరత్నమున మువ్వురు పువ్వుబోణులు నిలువంబడి యున్నవారు. వారింజూచి పార్వతీ ప్రముఖపద్మముఖులు వెరగుపడుచుండ నందుండియయ్యిందు వదనలు గ్రిందికిందిగి వారికి నమస్కరింపుచు నిట్లనిరి.