పుట:కాశీమజిలీకథలు-05.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

219

దమతమ వృత్తాంతంబులం నెఱింగించిరి. అప్పుడు పార్వతి విస్మయంబభినయించుచు సతీమణులారా ! ఇది కడు చోద్యముగా నున్నయది మేరుకూటమునుండి వచ్చినది మొదలు మదనవైరియు నెవ్వరితో మాటాడక కైలాసగుహాంతరాళంబున బడుకొని యున్న వాఁడు ఆ సభలోఁ ద్రిమూర్తులకు నేమి ప్రసంగము జరిగినదో తెలియదు. నారదమహర్షియే యీ సభకుఁ బ్రోత్సాహకుఁడు. ప్రాణముల వలె వర్తించెడు హరిహర బ్రహ్మలకు వైరములు గల్పించి కడుపు నిండించుకొనియెను.

ఆ యోగములో జరిగిన విశేషములు దెలిసికొనినంగాని వీరి కోపములకుఁ కారణములు దెలియవు. అవ్వార్తలు తెలిసికొన నందీశ్వరునికి వార్తనంపితి, నింతలో మీరు వచ్చితిరి కూర్చుండుఁడు అతండు వచ్చి సభావిశేషముల వక్కాణింపఁ గలఁడని పలుకుచుండఁగనే నందీశ్వరుఁడిచ్చోటికి వచ్చి పార్వతీ మహాదేవికి నమస్కరించెను. కాత్యాయని నందీశ్వరుని గారవింపుచు, వత్సా! మహేశ్వరులు దేవసభనుండి వచ్చినది మొదలు మౌనము వహించియు దీక్షాభావముతో నున్నవారు భక్తుల మొరలాలింపరు. ఇందులకు గారణమేమియో తెలియదు. ఈయనయేగాక బ్రహ్మాచ్యుతులుగూడ నిట్లె పడుకొని యున్నవారట. లక్ష్మీ సరస్వతులు పరితపించుచు నవ్విధం బెరింగి నా యొద్దకు వచ్చిరి. ఆ సభలో వీరి మువ్వురు కలుషించిరా యేమి ? అచ్చట జరిగిన వృత్తాంత మంతయు వక్కాణింపుమని యడిగిన నందీశ్వరుఁడు ముకుళిత కరకమలుండై, తల్లీ ! ఈ యుపద్రవమునకంతకు నారదుడే కారణుఁడు వినుమని యిట్లని చెప్పదొడంగెను. సభాదివస నిరూపణంబు గావించి నారదుఁడఱిగిన యనంతరము.

సీ. భలితాంగరాగలిప్త సమస్తగాత్రుఁడై
           పులితోలు గంకటంబుగబిగించి
    ఘనజటావితతిఁ జక్కగఁ దీర్చిము డివైచి
           కదలకుండఁ గజంద్రకళ నమర్చి
    గరళవహ్నిస్ఫులింగములఁగ్రక్కెడుమహో
           రగభూషణముల గాత్రములఁదాల్చి
    కరముల ఘనపినాక త్రిశూలప్రముఖ సా
          ధనముల ధరియించి తతపిశాచ.

గీ భూతభేతాళ సేనా సమూహములును
   ప్రమధగణములు వీరవేషములఁదాల్చి
   యనుసరింపఁగ వృషభవాహనమునెక్కి
   తరలెఁ బురవైరిమేరు భూధరముకడకు.

మరియుఁ దైత్యారితోఁ గలహింపఁ బురాంతకుండరుగుచున్న వాఁడని విని నముచి, శంబర, పులోమాది దానవులు చతురంగఁబల పరివృతులై మార్గమధ్యంబున