పుట:కాశీమజిలీకథలు-05.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నీకు సాటియెవ్వరును లేరు. సర్వమతములు నీకే తెలియును. నీయెరుంగనిది యొక్కటిని లేదు. సర్వజ్ఞుండను విరుదు నీకొక్కనికే చెల్లును. ఈశారదాపీఠకమెక్క నీవొక్కండివే సమర్ధుండవని యనేక ప్రకారముల స్తోత్రములుచేయుచు వాదులందరు తొలంగినంత నమ్మహాత్ముండు శిష్యులెల్ల జయజయశబ్దములు గావింపుచుండ మరియు -

సీ. చిత్రభానుండాత పత్రంబు వహియింపఁ
          దోటకుండలరి పాదుకలువట్ట
    మోదమొప్పవిరించి పాదభానుమరీచు
          లిరుగడఁజారు చామరములిడగ
    నానందగిరి యుశుద్దాత్ముండు క్షేత్రము
         ల్భట్టిముందరబరా బరులు సేయ
    కృష్ణదర్శన శుద్ద కీర్తులు తోరట
         దండముల్బూని చెంతలనటింప.

గీ. చిద్విలాసాది శిష్యప్రశిష్యకోటి
   యనుసరింపఁగ జయజయ ధ్వనులతోడఁ
   బద్మపాదునికైదండఁ బట్టికొనుచుఁ
   గదలె యతినేత శారదా సదనమునకు.

క. ఆరీతిభద్రపీఠం
   బారోహణమాచరింప దరుగంగఁగని యా
   శారద యిట్లనిపలికె శ
   రీర విహీనో క్తినతిప రిన్పుటలీలన్.

సంయమీంద్రా ! నీవు పూర్వమే సర్వవిద్యలయందును పరీక్షింపఁబడితివి. నీయందు సర్వజ్ఞిత్వము పరిపూర్ణముగానున్నది. లేకున్న విరించి రూపాంతరుండగు మండనమిశ్రుండు నీకుశిష్యుం డెట్లగును? అది యట్లుండనిమ్ము. ఏతత్పీఠాధిరోహణమునకు సర్వజ్ఞత్వమె ప్రధానముకాదు నినుమాత్మశుద్ధియుం గావలసియున్నది. అది నీ యందుఁ గలదో లేదో క్షణకాలము విచారించుకొని పీఠమెక్కుము.

నీవు యతిధర్మనిష్ఠుండవయ్యు గామకలారహస్య గ్రహణమునకయి యంగ నాశతముతో గ్రీడించితివి. యాకళంకమును మరచి యిపుడీ సింహాసనమెక్కుట కుద్యోగపడుచుంటివి. చాలుచాలు నిలునిలుమని పలికిన విని యెల్లరు నద్భుతపడిరి. అప్పుడు శంకరాచార్యులు అంబా ! నేను జనించినదివోలె నీశరీరముచేత నట్టికిల్బిష మేమియుఁ జేయలేదని నిశ్చయముగాఁ జెప్పఁగలను. దేహాంతరము సంశ్రయమున గావించిన క్రీడాకళంకము దీనినేలయంటెడినిఁ అది మరియొక శరీరము కాదా ? చిత్తవికారంబున బాపంబు దీనికి సంక్రమించునంటివేని అట్టి వికారము నా మదికి