పుట:కాశీమజిలీకథలు-05.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

199

వితండా హేత్వభాసుచ్చలజాతి నిగ్రహములని పదారువిధముల నొప్పుచుండును. తత్వజ్ఞానమువలన మోక్షము గలుగుననియు గణాదమతంబునంబోలె నీశ్వరుండు సర్వజగన్నిమిత్తకారభూతుండనియు గౌతమమతంబునను చెప్పబడియున్నది.

నైయాలు — స్వామీ ? నీవు శారదాపీఠారోహణ సమర్ధుండవని మేమొప్పుకుంటిమని గౌతమమతస్థులు తొలంగినంతఁ గపిలమతస్థు లడ్డమువచ్చి నిలునిలు మా మాటలకు నుత్తరము చెప్పి యరుగుము.

శం — మీరేమి యడిగెదరు.

సాంఖ్యులు — వినుము మూలప్రకృతి స్వతంత్రురాలై జగత్కారణమగు చున్నదా! లేక చిదధిష్ఠితజగత్కారణమా ! చెప్పుము.

శం — ఆమూల, ప్రకృతియే సత్వరజస్తమోచి దత్రిగుణాత్మకయై బహురూపభాగినియై స్వతంత్రురా లగుచున్నదని కాపిలమత సిద్ధాంతము కాని వేదాంతపక్షమందీమూలప్రకృతి యస్వతంత్రురాలని చెప్పఁబడియున్నది.

సాంఖ్యులు — భవదీయ ప్రజ్ఞాప్రభావంబు లచ్చెరువు గొల్పెడిని నీ యిచ్చ వచ్చిన ట్లరుగుము. అని సాంఖ్యులు మరలినంత బాహ్యార్ధ విజ్ఞానశూన్యులై వాదములు గావింపుచు సౌత్రాంతికవైభాషి యోగాచార్య మాధ్యమిక మతావలంబనులగు బౌద్ధు లడ్డమువచ్చి యోహో ! మాకు సదుత్తరములిచ్చి యరుగుము. నిన్నూరక పోనిచ్చు వారము కాము. వారివీరింబలె మమ్ముదాటిపోవ నీకు శక్యమా.

శం — వృధాప్రలాపములతోఁ బనిలేదు మీరడుగవలసిన యర్ధములేవియో యడుగుడు.

బౌద్ధులు - బాహ్యార్ధ మెన్నివిధములు.

శం — రెండువిధములు పౌత్రాంతికమనియు వైభాషికమనియు.

బౌ — దానికిఁగల తారతమ్యమేమి.

శం — సౌత్రాంత్రికమతంబున వేద్యజాతమంతయు ననుమాన గమ్యముగాఁ జెప్పఁబడియున్నది. వైభాషికమతంబునఁ బ్రత్యక్ష గమ్యముగాఁ జెప్పిబడియున్నది. రెంటిబదార్ధములకు క్షణభంగురత్వము సమానమే. రెంటికిని ననుమాన గమ్యత్వాక్ష గమ్యత్వారూపమయిన భేదము గలిగియున్నది.

బౌ — మా విజ్ఞానమునకును వేదాంతవాదుల విజ్ఞానమునకును భేదమేమి యున్నదో చెప్పుము.

శంక — విజ్ఞానమునకును క్షణికత్వము బహుత్వము కలవని మీలో విజ్ఞాన వాదులు చెప్పుదురు. వేదాంతులు స్థిరమయిన జ్ఞానమొక్కటియేయని చెప్పుదు రిదియే భేదము.

అని యీరీతి సర్వశాస్త్రములయందును సర్వమతంబులయందును గిన సదుత్తరములిచ్చినంత నందున్న వారెల్ల నయ్యాచార్యుం బూజించి, మహాత్మా !