పుట:కాశీమజిలీకథలు-05.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నీవు సర్వజ్ఞుండవైతివేని యీ తలుపులు తెఱచి లోపలికి బొమ్ము. ఇతరులకు నీదారిని రా శక్యముగాదు.

శంకరాచార్యులు - నేను సకలవిద్యలలోఁ బరీక్ష నియ్యఁగలను నాకుఁ దెలియని దేమియునులేదు. ఎవ్వనికేదానియందుఁ బాటవమోయం దడుగవచ్చును.

కాణాదమతస్థులు - నీవు సమర్ధుండవైతివేని మా మతరహస్య మొక్కఁటడిగెదము చెప్పుము.

శంక - నిస్సంశయముగా నడుగవచ్చును.

కాణా - షడ్భావము లేవియో యెఱంగుదువా?

శంక — ద్రవ్యగుణకర్మ సామాన్య విశేషసమవాయము లారును షడ్భావములని మీమతమునఁ బేరు పెట్టుకొనిరి.

కాణా - సరియే. వినుము. సంయోగమును బొందిన పరమాణుద్వయము నుండి సూక్ష్మమైన యణుద్వయము గలిగినదనిగదా మామతము.

శంక - అగుఁ దఱువాత.

కాణా - ద్వ్యణుకాశ్రితమగు నణుత్వ మేదిగలదో యది దేనివలన జనించు చున్నదో చెప్పుము.

శంక - చెప్పిననేమి.

కాణా -- నీవు సర్వజ్ఞుండవని యొప్పుకొనియెదము.

శంక - అట్లయిన వినుండు. పరమాణుద్వయనిష్టయైన ద్విత్వసంఖ్యయై ద్వ్యణకగతమైన యణుత్వమునకుఁ గారణమగుచున్నది.

కాణా — నీవు సర్వజ్ఞుండవౌదువు. నీకు నమస్కారము. నీవీ పీఠ మధిష్టింప సమర్దుండవే.

అని కాణాదులు తొలంగినంత నైయాయికు లడ్డమువచ్చి - నీవు సర్వజ్ఞుండవని యొప్పుకొని యెదము.

కాణా — దమమతముకన్న గౌతమమతమునంగల ముక్తివిశేష మెట్టిదో చెప్పుము.

శంక - ఇదియేనా చెప్పవలసినది వినుండు. గుణసంబంధ మత్యంతనాశమగుచుండు నాకాశమువలె నొప్పుచున్నస్థితి యేదిగలదో యదియే ముక్తియని కాణాద మతసిద్ధాంతము. ఆ స్థితియానంద సంవిత్తుతో గూడుకొనుట ము క్తియని గౌతమమతస్థులు చెప్పుచుందురు. ఇదియే భేదము.

నైయా — పదార్థభేదము లెట్టివి ?

శంక - కణాదమతమున ద్రవ్యగుణకర్మసామాన్యవిశేష సమవాయా భావములనిసదార్థములేని సువిధములు గౌతమపక్షమందు బదార్థములు ప్రమాణా ప్రమేయ సంశయబ్రయోజనదృష్టాంత సిద్ధాతావయవతజర్క విణత్ యవాదిజల్ప