పుట:కాశీమజిలీకథలు-05.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

185

గలుగు. నిదియే మా మత సిద్ధాంతమని పలికిన శంకరుం డిట్లనియె. జైనుఁడా ! జీవునికి స్థూలసూక్ష్మకారణ భేదములచే మూడుదేహములు గలిగియున్నవి. ఆశరీరత్రయము క్రమముగా లయమైన పిమ్మట జీవుండు సచ్చిదానందస్వరూపుండగును. నేనీశ్వరుని కంటె భిన్నుండనని పలుకుట యజ్ఞానము. కావున నభేదబుద్ధితో హృదయస్థుండైన యీశ్వరుందెలుసుకొనుము. ముక్తుండ వయ్యెదవు. అంతియకాని దేహపాతమేమోక్షమని పలుకుట యవివేకము. మోక్షము కడుదుర్లభమైనది . యద్వైతజ్ఞానము సంపాదించు కొనుము. ముక్తుండవయ్యెదవని పలికిన వాని శిష్యసహితముగా సంస్కరింప పద్మపాదాది శిష్యులకు శిష్యునిం గావించెను.

తరువాత శబలుండను బౌద్ధుండువచ్చి శంకరునితో నీ బోధవలన బ్రయోజన మేమియును లేదు. నరశృంగ సమంబగు నీయభేదజ్ఞానము సర్వోత్తమమని వాదించుచు లోకుల వంచించుచున్నావు ప్రత్యక్షఫలమును విడిచి నీవు కడుదూరమైన యదృష్టఫలమును గోరుచున్నావు. దృష్టద్రోహివైతివి. శూన్యమగు పరోక్షము ఫలంబెట్లీయ జాలెడిని. ఆహా ! నిర్జీవమగుట నీమతమపార్థమైనది. మామతమందు హృదయప్రేరకుండై సుఖాత్మయై జీవుండు నిత్యముక్తుండగుచున్నాడు. మఱియు నేనే కర్తను నేనే పరానంద స్వరూపుండనని తలంచుచు నెంతవఱకు నీదేహక్రీడా యిష్టమగునో యంతకాలం మీ దేహంబునఁ గ్రీడించుచుఁ బిమ్మట శరీరమును విడిచిపోవును అదియే ముక్తియని మా మతసిద్ధాంతము. అన విని శంకరుం డిట్లనియె. బౌద్ధుండా !

శ్లో॥ సత్యశౌచపరోయస్తు దేవకాతిథిపూజకః
     సయాతిబ్రాహ్మణో లోకం యావదింద్రా శ్చతుర్దళ॥
     అగ్నిష్టోమం దేవతాప్రీతిదం చేత్కుర్యాదన్మా దింద్రలోకం సయాతి
     సత్యాఖ్యం సత్పౌండరీకా త్ప్రయాతి తత్తద్దేవోపాసకాస్తంతమేవ
     యోయోయాంయాంతనుంభక్తశ్శ్రద్ధయార్చితుమిచ్చతి
     తస్యతస్యాచలాంశ్రద్ధాంతామేవవిదధ్యామ్యహం.

ఈ మొదలైన పురాణవచనములంబట్టి పరలోక గమనాదికమును ప్రసిద్ధమై యున్నది. అన్నమయదేహపాత మాత్రముననే ముక్తియని చెప్పుట యవివేకము. ప్రమాణశూన్యమైనది. జ్ఞానమునగాని మోక్షము సిద్ధించదని వేదము చెప్పుచున్నది. కావున బరమాత్మను దెలిసికొని ముక్తుండవగుము.

అనర్ధప్రదాయియై కల్పితమైన జీవితభ్రాంతిని విడువుము. సచ్చిదానంద స్వరూపమముగాఁ దెలిసికొనుము మూఢభావమును విడిచి స్వస్థుఁడవై యద్వైతజ్ఞానము సంపాదించుకొనుమని బోధించిన విని యా బౌద్ధుండు శంకరాచార్యుం గొనియాడుచు వందిమాగధ సూతవేషములలో నమ్మహాత్ముని సేవింపుచుండెను.