పుట:కాశీమజిలీకథలు-05.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

కాశీమజిలీకథలు - ఐదవభాగము

వలన స్వర్గము వచ్చునని చెప్పఁబడియున్నది. తద్వాక్యముల నాక్షేపించువారు వేదబాహ్యులగు పాషండులని చెప్పఁబడుచున్నారు.

శ్లో॥ వేదనిందాపరాయేతు సదాచారవివర్జితాః।
     తేసర్వెనరకంయాంతి యద్యపిబ్రహ్మవీర్యజాః॥

పూర్వాచారములను విడిచి వేదనింద గావించుచుండెడివారు బ్రాహ్మణబీజ సంభూతులైనను నరకమును బొందుదురని మనువు చెప్పియున్నాఁడు కావున బ్రాహ్మణాదివర్ణ ములు వేదమందుఁ జెప్పఁబడిన యాచారములు చేయవలయును. నీవు చెప్పిన ధర్మములు తద్విరుద్ధములగుటచే నింద్యములైనవి. మరియొకసారి ప్రయాణశూన్యముగా సంభాషించితి యేని దండింపఁజేయుదునని పలికినంత వాఁడు సంతుష్టినొంది తత్పాదు కావాహకుండై తిరుగుచుండెను.

తరువాతఁ గౌపీన మాత్రధారియై క్షపణకుండు గొలయంత్ర మొకచేతను, దురీయంత్రమొకచేతను ధరించి శంకరుని మ్రోలనిలువంబడి స్వామీ! నా మతము కడువిచిత్రమైనది. మంగళప్రదమైనది వినుండు కాలప్రవర్తకుఁడగు సూర్యుని నీయంత్ర ద్వయమునుచేతను గట్టివైచి సమయజ్ఞాన కౌశల్యమునంజేసి త్రిలోకములకు శుభాశభ ఫలంబుల చెప్పఁగలను కాలమే పరమాత్మయని మా మత సిద్ధాంతము. ఇట్టి మతమును నిరాకరింప నీ తరమా? పరేశుండైన సమర్థుండువాడు. అనుటయు శంకరాచార్యులు "ఓరీ క్షపణక ! లెస్సగాఁ బలికితివి. నీవు కాలవేదివని యెఱుంగుదును. నీవు నన్నాశ్రయించి యుండుము. పరీక్షాకాలము వచ్చినప్పుడు పరీక్షించుదు" నని పలికిన వాఁడందులకు సమ్మతించి యది మొదలయ్యతి నాశ్రయించి తిరుగుచుండెను.

పిమ్మట జైనుండు కౌపీనము ధరియించి యొడలంతయు మలముఁ బూసికొని బిందువులే పుండ్రముగా ధరియించి భయంకర వేషముతోఁ బిశాచమువలె నొప్పుచుఁ బెక్కండ్రు శిష్యులు సేవింప శంకరుని మ్రోలకు వచ్చి అర్హన్‌నమోయని పలుకుచు నిట్లనియె.

మ. జినదేవుండెసమగ్రము క్తిదుఁడు నర్చింపంగనర్హాత్ముఁడా
     యనయే ప్రాణులహృత్సరోజముల జీవాత్మస్వరూపంబునం
     దనరారున్నతతంబు తద్వసతినం తర్బుద్ధిధ్యానించుటే
     ఘనవిజ్ఞానమనంబడున్ గలుగుము క్తత్వంబుతత్ప్రాప్తిచేన్.

స్వామీ! జినదేవుండు సమస్తప్రాణుల హృదయంబున వసియించి జ్ఞానప్రదుండై దేహపాతంబున జీవునిఁ బరిశుద్దునింజేసి ముక్తునిం గావింపుచుండును. దానం జేసి జీవుండు శుద్ధుఁడగును. దేహము మలపిండసదృశమైనది. స్నానాదిక్రియలవలన నెప్పుడు నిది శుద్ధముకానేరదు. కావున స్నానాదికము చేయఁగూడదు. మాలిన్యదేహముతోనే తిరుగుచుండవలయును. ఇట్లుండ జినదేవుని కరుణవలన దేహపాతంబున శుద్ధత్వము