పుట:కాశీమజిలీకథలు-05.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

181

యెవ్వండైన బ్రతికివచ్చెనా? అట్టివానిని సకుటుంబముగా నిర్మూలించిన యతనియెదుర మనబోటివారము నిలువబఁడి వాదింపలేము.

జైనుఁడు — క్రకచునిచే నాహూయమానుండగు భైరవుండు క్రకచుని శిరంబే హరించెనఁట ఇది యేమిచిత్రము ? తత్పురస్సరముగా మన మాశంకరునిఁ బరిభవించవలయునని తలంచితిమి. యేదియును లేకపోయెనే.

బౌద్ధులు — మంత్రబలంబున సన్యాసి క్రకచునికన్న నధికుండగుటచే నట్లు జరిగినది. కానిండు మనమీమూలఁ గూర్చుండి యాలోచింపనేల? యెదురఁబడి యడుగుదము రండు. అతండు పరమశాంతుండఁట. మనమాటలకు సదుత్తరము లీయక మానఁడు.

జైనులు — అతఁడు మంచివాఁడేకాని శిష్యులు కడు క్రూరులు వృద్ధకాపాలికు నెట్లు కావించిరో చూచితిరా?

బౌద్ధులు — వాని నేమి చేసిరి?

జైనులు - అతండు తన మతప్రవృత్తి యంతయుం జెప్పుకొనుటకు నవకాశమిమ్మని సన్యాసిని కోరికొనియెను.

బౌద్ధులు — సన్న్యాసి యందుల కంగీకరించెనా?

జైనుడు — వానిమాటలన్నియు జిరునవ్వుతో నాకర్ణించి చివర నెక్క సక్కెములాడి పొమ్మని పలుకునంతలో వాఁడు మొఱపెట్టుచుండఁ దదీయశిష్యజనంబులు సారమేయతండంబులు వరాహపోతంబునుంబోలెఁ బట్టికొనికరపదప్రహరణంబుల బాధింపుచు దూరముగాఁ దోలివచ్చిరి.

బౌద్ధులు — అది యసహ్యమే యెద్దియో యుపాయంబున మనము వారి బారిఁ బడకుండ వాదించి రావలయును.

జైనులు - వినయమునుం జూపిన వారేమియుంజేయును.

బౌద్ధులు — వ్యతిరేకము దోచినప్పు డాలాగుననే చేయుదము.

జైనులు - చార్వాకుఁడు వాచాలుండగుట మొదట వాని బ్రసంగింపఁ జేయుదమని యొండొరు లాలోచించుకొని యందరు నయ్యతిపురందరుని చెంతకుంజని నమస్కరింపుచుఁ దమతమ మతలక్షణంబుల వక్కాణింతుమని చెప్పి తదనుజ్ఞ వడసిన పిమ్మట.

చార్వాకుఁడు - స్వామీ ! మీరు తత్త్వవేత్తలుగదా ! ముక్తి లక్షణమెట్టిదో యెరింగితిరేని వక్కాణింపుఁడు. మరణానంతరమున ముక్తిగలుగునని మీరు చెప్పు చుందురు. అది యేమియు సత్యముకాదు. దేహముతో జీవునికి విడుపుగలుగుటయే ముక్తియని చెప్పఁదగినది. సముద్రమందు లయమైన నదులు తిరిగి వచ్చుట దటస్థించెనేని మరణము నొందినవారికి మోక్షముగులుగు. మృతినొందినవారిని శ్రాద్ధాదికమువలన దృష్తినొందించుట అనిన దీపమును జమురుబోసి వృద్ధినొందించునట్టిదే. అంతకన్న