పుట:కాశీమజిలీకథలు-05.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ఆత్మీయులు మడియుటయు భూసురులు మురియుఁచుండుటయు జూచి క్రకచుం డవిదూయమాన మానసుండై శంకరు నంతికంబున కరుదెంచి, వంచకుఁడా! దీనికిఫలం బనుభవించెదు. చూడుము మదీయ ప్రభావంబని పలుకుచు మానవకపాలంబు చేతులందాల్చి కన్నుల మూసికొని యించుక వెనుకకువంగి భైరవుని ధ్యానించెను. తదీయ మంత్రప్రభావంబెట్టిదో యంతలో నాకపాలము మద్యప్రపూరితంబై యొప్పుటయు నాక్రకచుండు దానిలో సగముగ్రోలి వెండియు భైరవుని ధ్యానించెను. అట్టి సమయమున నక్కపాలాంతరమునుండి.

మ. జ్వలనజ్వాలల సజ్ఞటాపలితో శస్త్రాస్త్రశూలావళీ
    విలసద్భాహువుతోఁగ పాలరచిత స్పీతప్రదామాళితోఁ
    బ్రళయాంభోదరవాట్టహాసములతో బ్రహ్మాండ మెల్లన్ భయా
    కులమైతొట్రుపడంగ భైరవుఁడు బల్కోపంబుతో ముంగిటన్.

ఆవిర్భవించుటయుంగాంచి క్రకచుండు కేలుదోయి ఫాలంబున గీలించి, స్వామీ ! మీ భక్తజనులకు ద్రోహంబుగావించు నీనీచుంబరిమార్పుము. ఇదియే మదీయ వాంఛితంబని శంకర యతీంద్రునిపైఁ బ్రయోగించుటయు నమ్మహాత్ముం డౌరా ! క్రూరాత్మా మదీయాత్మస్వరూపుండగు శంకరునియందే ద్రోహముచేయఁ బూనితివా ? చాలు చాలు. నీపాతంబు నిన్నే చెందెడుంగాక యని పలుకుచుఁ గ్రకచుని శిరంబే తునుమాడి నాట్యము గావింపఁదొడంగెను. అప్పుడు శంకరాచార్యుండయ్యార్యమూర్తి ననేక ప్రకారంబులఁ గొనియాడుచు స్వామీ ! సంహారభైరవ! వేదశాస్త్రపురాణముల యందు బ్రతిపాదితమగుకర్మ బ్రాహ్మణులకవశ్యకర్తవ్యము. అట్టికర్మచేయుటవలన ధర్మమభివృద్ధినొందునని నా యభిప్రాయము. ధర్మంబునం బాపనాశనంబగు పాప నాశనమగుడు మనశ్శుద్ధిగలుగును. మనశ్శుద్ధివలన నాత్మ సాక్షాత్కారమగును. అని యీరీతి నేను బ్రాహ్మణసభయందుపన్యాసముఁ జెప్పుచుండగా విని నీభక్తుండా క్షేపించుచుఁ గర్మవలనఁ బ్రయోజనములేదనియు వేదశాస్త్రాదుల సంగతార్ధావబోధకములనియు జాతులతో నిమిత్తములేదనియుఁ భాషండధర్మముల యుక్తియుక్తముగా నాసభ యందు వక్కాణించెను.

అప్పుడు మదీయశిష్యులు వానింబట్టికొని దూరముగా గెంటివైచిరి. దాన గోపించి వాఁడు నిన్ను మంత్రబద్ధుంజేసి రప్పించెను. అటుపిమ్మట నందలి సత్యా సత్యంబుల నిరూపింప నీవే ప్రమాణమని పలికి శంకరాచార్యుడూరకుండెను.

అప్పుడు భైరవుండయ్యతిపుండరీకుఁ గొనియాడుచు, శంకరా ! నీవు సర్వజ్ఞుండవు. పూజ్యుండవు. వేదపదార్ధముల నెఱింగిన విజ్ఞాత నీకంటె మఱియొకఁ డెందునులేఁడు. నీచెప్పిన యుపన్యాసంబు నాక కాదు త్రిలోకములకు సమ్మతియై యున్నది. అదియే యదార్థంబు ఈ గాపాలికులనెల్ల బ్రాహ్మణాచారతత్పరులం