పుట:కాశీమజిలీకథలు-05.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

163

తరువాత పంచరాత్రాగమ దీక్షితుండగు మాధవుండను వైష్ణవుండు స్వమతస్థులచే శంకరునియెదుటకుఁ ద్రోయఁబడి సభాకంపముచేఁ గాళ్ళుచేతులు వడఁకుచుండఁ జూచినవ్వుచు,

శంక - అట్లువణఁకెదవేల ? నీ మత ప్రచార మెట్టిదో నుడువుము భయము లేదు.

మాధ — స. స. సామి! మె. మె. మేము. ప. ప. పాంచ. ర. ర. రాత్రులము.

శంక — నీకు నత్తి యున్నదా యేమి ?

ప్రద్యుమ్నాచారి — అయ్యా ! ఆయనకు నత్తిలేదు. కొంచెము సభాకంపమున్నది, వాదములోఁ బ్రౌడుండే!

శంక - వైష్ణవప్రవరా ! మనస్సుదృఢపరచికొని నెమ్మదిగాఁ గూర్చుండి నీ మత ప్రవృత్తిఁదెలియఁజేయుము.

మాఢ - చిత్తము. చిత్తము. ఇప్పుడు భయముదీరినది. చెప్పెదవినుఁడు. స్వామీ ! భగవత్ప్రితిష్ఠకు మాయాగమమే మూలమైనది. మాయాగమము లేనిచో భగవంతునికిఁ బ్రతిష్ఠయేలేకపోవును. కావున మాయాచారమెల్ల బ్రాహ్మణులు స్వీకరించిన జక్కగా నుండును. ఇదియే మా మతము.

శంక — వేదవిరుద్ధముగానిచో మీయాగమము మంచిదే. గాయత్రివలనంగాని బ్రాహ్మణ్యము సిద్ధించదు. ఆగమవ్యతిరిక్తమంత్రంబుల గ్రహించుట బ్రాహ్మణుల కనుచితంబు, గాయత్రీశూన్యులగుట మీరు బ్రాహ్మణులుకారు. బాహ్మణ్యహీనమగు వైష్ణవత్వము పతితముగాఁ జెప్పఁదగినది. పతితుఁడవగు నీతో మాబోఁటులు సంభాషింప రాదు. నీవు జీవన్మృంతుడవైతివి.

మాధ - స్వామీ ! చిహ్నధారణమువలన వైకుంఠము వచ్చునని మాపాంచ రాత్రాగమములో నున్నది. మాయాగమమే మాకుఁ బ్రమాణము.

శంక - ఆగమాదులయందుఁ జెప్పఁబడిన యాచారము వేద విరుద్ధము కానిచోఁ గ్రహింపదగినదే తద్విరోధంబైన మతము గ్రాహ్యముకాదు. పాంచరాత్రాగమము వేదవిరుద్ధమయినది స్వీకరింపఁబడదు. అతీంద్రియార్ధముల నెరిఁగింప శ్రుతియే సమర్ధమైనది. బ్రాహ్మణ్యసిద్ధి కొరకు వేద విహితాచారములఁ గైకొనుడు. దానబూతుఁడ వయ్యెదవు.

శ్లో॥ సర్వభూతేషుచాత్మానం సర్వభూతానిచాత్మని
     సంపశ్యన్ బ్రహ్మపరమం యాతినాన్యేన హేతునా.

సర్వభూతములయందుఁ దన్నును దనయందు సకలభూతముల నెవ్వఁడు చూచునో వాఁడేముక్తుఁడు యధాజాతుఁడా ! పాషండ ధర్మముల విడిచి యద్వైతజ్ఞాన