పుట:కాశీమజిలీకథలు-05.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

161

వచ్చెడిని. అను మొదలగు శ్రుతినిబంధనలు కర్మను స్తుతిఁ జేయుచున్నవి. విష్ణు సేవయే బ్రాహ్మణకర్మ యని చెప్పుట యపాండిత్యము. వేదవిహితమైనదే కర్మ. కర్మ విడచిన వాడు జీవచ్ఛవము. యతులకు సైతము దేవతార్చనాది మగు కర్మ విధించఁబడియున్నది. మీరు కర్మభ్రష్టులైతిరి గావున ప్రాయశ్చిత్తముఁ జేసికొనినగాని మీతో సంభాషించరాదు. అని యుక్తియుక్తముగా వారికి బోధించి త్రుటిలో నిరుత్తరులంజేసెను.

తరువాత భాగవతులు ముందరికి వచ్చి స్వామీ! మా మతము వినుము.

శ్లో॥ సర్వవేదేషుయత్పుణ్యం సర్వతీర్ధేషుయత్ఫలం।
     తత్పలంపురుషఆప్నోతి స్తుత్వాదేవం జనార్దనం॥

సర్వ వేదముల యందు సర్వ తీర్ధముల యందు నే పుణ్యము గలదో విష్ణు స్తుతి వలన నట్టి పుణ్యము రాగలదు. అను వచనము ననుసరించి రాత్రింబవళ్ళు హరికీర్తనం జేయుచు శంఖచక్రాది చిహ్నలం బూని తులసి మాలికల ధరించి యూర్ధ్వపుండ్రములు మెఱయ వసింతుము. ముక్తి మా హస్తమందున్నది. దీనికేమి లోపము లెంచెదవో చెప్పుము.

శంక - చక్రాద్యంకనము శాస్త్రదూష్యమగుట మీ మతము దూషణీయము.

మఱియు,

శ్రుతి - "యతోవాచోనివర్తంతే అప్రాప్యమనసాసహ"

మనసుతో గూడ వాక్యములెవ్వని మహిమఁ దెలిసికొనలేక మరలుచున్నవో అను శ్రుతివలన నదాజ్మాననగోచరుండగు భగవంతుని మీరెట్లు స్తుతియించఁ గలరు. ఈ జడశంఖాదు వలనఁ గలిగిన చిహ్నం దాల్చుటకంటె లోహచక్రాదుల ధరియించిన విష్ణుండువోలె నొప్పుచుందురు అంతకన్న మరియొక విశేషమువినుండు. కరచరణాద్యవయవ విశిష్ట బగు విష్ణుశిలామూర్తిచే సర్వరూపమంతయు వ్యక్తమగు నట్లు మేనంగాల్పించుకొనుఁడు. మీకుముక్తి నధ్యఫలంబోసంగెడిని మూఢులారా! మిమ్ము విష్ణుభక్తులనుటకంటె పాషండులని చెప్పిన నొప్పిదనుగును ఊరక చెడిపోవకుడు. ఫలమీశ్వరార్పణము చేయుచు విహితకర్మ నొనరింపుఁడు దానశుద్ధులగుదురు. పిదపనద్వైతవేత్తయగు గురునాశ్రయించుఁడు తదుపదేశలాభంబున నష్టకర్మ బంధులై ముక్తులగుదురు. మోక్షమునకంతకంటె వేఱొకదారిలేదు. సగుణోపాసనము స్థిరముక్తి నీయఁజాలదు. అని యద్వైతజ్ఞానబోథఁజేసి వారినెల్ల శిష్యలగాఁ జేసికొనెను.

పిమ్మట శార్జపాణియనువైష్ణవుఁడు లేచి నమస్కరింపుచు స్వామీ ! మేము నమోనారాయణాయయను మంత్రము నెల్లపుడు జపముసేయుచుందుము. శంఖచక్రాదు.