పుట:కాశీమజిలీకథలు-05.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

159

శ్లో॥ శివతేజస్సముద్భూతాహరిబ్రహ్మాదికోటయః
     క్రియంతేపున రేవైతేతత్రతత్రలయానుగాః
     ఇతిసస్మాచ్చివ స్యైవతత్పతిత్వంసునిశ్చితం

శివుండు సర్వాధికుండగు నట్లనేక నిదర్శనములున్నవి!

మఱియు

శ్లో॥ ఆతప్తాత్మతనుర్నైవతద్దామైతీతిమానతః
     లింగాంకనమవశ్యంవైకర్తవ్యంమోక్షకాంక్షిభిః
     శ్రుతి॥ "అతప్తతనుర్నతదామో అద్నతే"

అను శ్రుతివలన శరీరతాపనంబునఁగాని మోక్షము జెందనేరఁడని స్థిరపడుచున్నది. అందులకే త్రిశూలాది చిహ్నములచే నంకితులగువారికి ముక్తిగలుగునని మా మతసిద్ధాంతము.

శం — అయ్యో ! మీకు విద్యాగంధమే లేకపోవుటచే జ్ఞానసూక్ష్మము దెలియకున్నది. శివుండు సర్వోత్తముండని యభేదబుద్ధిం జెప్పిన నొప్పుగదా ? శివుం డుత్తముండని చెప్పుచు విష్ణుండతని దాసుండని నిందించుచుందురు. అదియే మూఢత. శివవిష్ణ్వాది శబ్దములు పరమాత్మయొక్క సగుణరూపవాచకములు. ఈ రహస్యం బెరుంగక శివుండధికుండు విష్ణుఁడు దాసుఁడు బ్రహ్మ పరిచారకుండు అని శివాధిక్యము స్థిరపరుచుకొనుచున్నారు. "అతప్తతను" అను శ్రుతికది యర్ధముకాదు. కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతములచే శరీరమును దపింపఁ జేసికొనవలయునని వేదాభిప్రాయము. పశువువలెఁ గాల్చికొనిన మోక్షము సిద్ధించునా ?

శ్లో॥ లింగాంకితతనుదృష్ట్వా శంఖచక్రాంకితంతథా
     స్నానమేవతదాకార్య మథవాసూర్యమీక్షయేత్
     వితితంతప్తలింగాఢ్య చక్రాంకితమధాపివా
     వాజ్మొత్రేణాపినార్చేత పాషండాచారతత్పరం
     అపిశూద్రేక్షణాద్భుంజే ల్లింగచక్రాంకితంవినా
     అపిచేన్ని గమాచార రతో వేదాంగ తత్పరః॥
     లింగచక్రాంకమాత్రేణ ససద్యః పతితోభవేత్ ॥

అను మొదలగు ప్రమాణములచే చిహ్నధారణము నింద్యమని బృహన్నారదీయములోఁ జెప్పఁబడియున్నది. శ్రు॥ "యతోవాచోనివర్తంతే అప్రాప్య మనసాసహ" అను శ్రుతివలన నవాజ్మాననగోచరుండగు పరమేశ్వరుండొక్కఁడే నిత్యుఁడు. శివకేశవాది నామములు సగుణోపాసకులగు మూఢులకు నియమింపఁబడినవి. ఈశ్వరా రాధనము వలదని నేను చెప్పుచుండలేదు. నింద్యమునుగాదు. భూతి రుద్రాక్షాదులను ధరింపవలసినదే.