పుట:కాశీమజిలీకథలు-05.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

కాశీమజిలీకథలు - ఐదవభాగము

   తత్తపోర్ధ వలంబన్న దాతఁజేరు
   ననుచు స్మృతులెన్న వినమె మహాత్ములార

గీ. ఉర్విగృహపతి చల్లగా నుంటఁగాదె
   సాగుచున్నది తాపస జనతపంబు
   యతులనియమంబు మడుగుల వ్రతముభిక్షు
   కులప్రవాసంబు మహిదైర్ది కులప్రసేవ.

గీ. కాన గృహపతి యందఱికన్న నధికుఁ
   డన్న మన్నమటంచు గృహంబుఁజేరు
   నతిథిఁ బూజింపరయ్య సత్యముగదాన
   గలుగు సుకృతము కోటియాగములరాదు.

క. భగవత్ప్రీతిగ నిత్యము
   లగుకర్మలఁ జేయుఁడీ ఫలాపేక్ష దృఢం
   బుగవిడువుఁ డట్టులైనన్
   జగతిని మిముఁబోల రెట్టి సాధువులైనన్.

అని గృహస్థధర్మంబులం గొనియాడుచు నీతిమార్గం బుపదేశించి బంధుజనంబునెల్ల సాదరంబుగా ననిపెను. పదంపడి మేనమామచే నర్చితుండై యతని గృహంబున భిక్షగావించెను. అట్టిసమయంబున మాతులుఁడు శిష్యహస్తచ్ఛన్నంబైన యొకపుస్తకమును జూచి యదియేమని యడిగిన బద్మపాదుండు ఆర్యా! యిది శంకరాచార్య కృతంబగు సూత్రభాష్యమునకు టీక నాచే రచింపఁబడినది. వినుమని యంతయుం జదివి వినుపించుటయు నతండతని ప్రబందనిర్మాణ నైపుణ్యమున కెంతయు వింత పడుచు మతాంతరఖండనల నిరుత్తరముగాఁ జేయఁబడిన తద్రచనకుఁ ప్రభాకర శిష్యుండగుట నీసుజనింప స్వమత తిరస్కారంబువలనం గలిగిన మత్సరంబు వెల్లడి గానీక మందహాసముఁ గావించి మిక్కిలి స్తోత్రము గావించెను.

అక్కపటం బెరుంగక పద్మపాదుండు ప్రయాణసమయంబున నాపుస్తకము మాతులహస్తముననిడి ఆర్యా ? నాకు దీనియందు జీవితముకన్న నెక్కుడు ప్రీతిగలిగి యున్నది మార్గమధ్యమందుఁ బ్రత్యనాయమేమైనఁ గలుగునేమో యనివెఱచి ఇది నీకడ నప్పగించుచున్నవాఁడ. నేను సేతుయాత్రఁ జేసికొని సత్వరముగా వచ్చువాఁడ? నంత దనున భద్రముగా దీని గాపాడవలయు. నీకన్న నాకుఁ బరమాప్తుడు లేఁడుగదాయని పలుమారు చెప్పి చెప్పి యతండు శిష్యులతోఁ గూఢ రామేశ్వరమున కఱిగెను.

పిమ్మట మాతులుం డాలోచించి యాహా ! యిప్పుడీ పుస్తకము నాచేతం బడినదిగదా. దీని రూపుమాపితినేని గురుమతరక్షకుండ నగుదును. కానిచో నిందలి మతఖండనల కుత్తర మెవ్వఁడు సెప్పగలఁడు? విశ్వాసఘాతుక పాతకమువచ్చిన