పుట:కాశీమజిలీకథలు-05.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

కాశీమజిలీకథలు - ఐదవభాగము

రోగాదికములు బాధించునప్పుడు సహవాసము కావలయునని నాత్మతీర్థ మాడువారికిఁ దీర్థయాత్రవలనం బ్రయోజనము లేదనియుఁ బెదతడవు చెప్పి పోవలదని బోధించెను.

చిత్సఖుఁడు — గురువచనము తిరస్కరించి పద్మపాదుం డేమిటికిఁ దీర్థయాత్ర కరిగెను.

హస్తామ — తిరస్కరించి యరుగలేదు. తీర్ధసేవవలన మనస్సు నిర్మల మగుట, దేశవిశేషదర్శనలాభము, అనర్ధములు పోవుట, సజ్జనసాంగత్యము, పండితవిశేషసంవాదలాభము లోనగు కార్యములు సంఘటించును గావున నందుల కాజ్ఞ యిమ్మని పద్మపాదుండు గురునిఁ బెక్కుగతులఁ బ్రార్ధించిన నాయన యంగీకరించి యతం డరుగునప్పు డి ట్లుపదేశము గావించెను.

సీ. అరుగకు మొక్కండ వధ్వనెన్నడుఁ బహు
          బ్రాహ్మణు ల్గలుగునూరనె వసింపు
    తరుచు సజ్జనులతోఁ బరిచయం బొనరింపు
          మతిమార్గఖేదంబు నపనయించు
    జలమైనఁ గొనకుము దెలియకుండఁగ దాన
          సర్వస్వహరణదోషము ఘటించు
    గూఢరూపములఁ గైకొని దారిఁ దోడ
         వత్తురు చోరు లట్టిధూర్తుల గ్రహింపు

గీ. మరుగునప్పుడు దారిలో నడ్డపడిన
    బిక్షుకుల నాదరింపుము పృథుమనీష
    ధ్యాన మొనరింపు మెప్పడ ధాత్మతత్త్వ
    మనఘ సుఖమగు దారిని కట్టలైన.

చిత్సుఖుండు — ఓహో మనగురువరునకుఁ బద్మపాదునియం దెట్టితాత్పర్య మున్నదియో చూచితివా? యతండు తిరుగ నెన్నిదినములకు మనలం గలిసికొనునో తెలియునా?

హస్తామలకుఁడు - రెండునెలలలోపున వత్తునని చెప్పిపోయెను. అదిగో తోటకాచార్యులు స్నానమునకు వచ్చుచున్నాఁడు. మన గురుండు సమాధినుండి లేచె నేమో యడుగుదము.

తోటకుఁడు — బ్రవేశించి అయ్యో మీరిందు జాగుసేయుచున్నా రేమి మన యాచార్యుఁడు యోగశక్తిచే మాతృవృత్తాంత మెద్దియో యంతఃకరణగోచరముఁ జేసికొని యచ్చటికిఁ బోవలయునని ప్రయత్నము చేయుచున్నాఁడు. త్వరగా రండు సురేశ్వరునితో నెద్దియో ముచ్చటింపుచున్నాఁడు.