పుట:కాశీమజిలీకథలు-05.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

19

విద్యల బృహస్పతియు, ధనంబున గుబేరుండు నై గర్వమనునది యించుకయు నెరుంగక వినయసంపత్తితో నొప్పుచుండ బెద్దకాలమరిగెను. సంతానము కలిగినది కాదు.

క. వింతగృహంబులు భూముల
   నంతకనక ధేనుహస్తి హయపశుచయముల్
   సంతోషపెట్టజాలవు
   సంతానములేని యట్టి జనునెవ్వేళన్.

గీ. కలుగుదప్పక యీ శరత్కాలమందు
   బొడమునీచై త్రమున నది గడచెనేని
   దాటదీరానకారు నందనుడువొడమ
   ననుచు దలపోయుచుండనేం డ్లరిగె బెక్కు.

అట్లు పెద్దకాల మరిగినంత సంతానవిహీనతా సంతాపంబు స్వాంతము త్తలపెట్ట శివగురుండొక్కనాడు భార్యతో నిట్లనియె.

సాధ్వీ! మనకు సగము కాలము గతించినది. సంతానము వొడమదయ్యెను. కర్తవ్యమేమియు తెలియకున్నది. సంసారమసార మనియే నేను మొదట బెండ్లి జేసి కొననని నిశ్చయము జేసికొంటిని. గురుండు నీకు లోకవిఖ్యాతుండగు కొమరుండు గలుగు నతనివలన లోకోపకృతి గాఁగలదు. పెండ్లియాడుమని రహస్యముగాఁ జెప్పి నన్నీ యరణ్యమునఁ బ్రవేశ పెట్టెను. రెండింటికిం జెడితిని. అపత్యరహితులమగు మనల నెవ్వరు స్మరింతురు. పల్లవఫలదళభరితమైన వృక్షమును విడిచి గొడ్డుచెట్టు నెవ్వరైన నాశ్రయింతురా! ఇప్పుడు నేను వంశహర్తనైతిని. పితౄణబద్ధుండ నైతినని యనేకప్రకారములు విచారింపుచు భార్యతోఁ బ్రసంగించిన నమ్మహాసాధ్వి యిట్లనియె.

ప్రాణేశ్వరా! దీనికై మీరింత చింతింపనేమిటికి ? మనము భక్తజన కల్పద్రువమైన చంద్రశేఖరు నాశ్రయింతము. మనకు స్థిరమైనఫలము లభించును. దీనికుపమన్యువే ప్రమాణము. వినుండు.

ఉపమన్యుని కథ

తొల్లి యుపమన్యువను ముని బాలకుండాడుకొనుచు నొకచోట బాలుద్రావు చున్న కొందఱు మునిబాలకులతోఁ గలహించి యీసులోఁ దల్లి యొద్దకువచ్చి, "అమ్మా నేనిప్పుడాడుకొనఁ బోయితిని. అందుఁగొందరు పిల్లవాండ్రు తెల్లనివేమియో త్రాగుచున్నారు. నాకు గొంచెమిమ్మని యడిగిన వెక్కిరించిరి. వానిపేరేమి" యని యడిగిన విని యతని తల్లి, నాయనా! అవి పాలు గోపులవలనం బుట్టునని చెప్పినది.

ఆ మాట విని యాబాలుండమ్మా! నాకాపాలు దెచ్బియిమ్ము గ్రోలవలయు