పుట:కాశీమజిలీకథలు-05.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

125

అని వినంబడిన యద్దివ్యవాణి నాలించి యమ్మహాత్ముండు చేతులు జోడించి వెండియు నిట్లు వక్కాణించె.

గీ. ఎల్లలోకంబులను బేర్మి నేల నేర్పు
    గలుగనీయను కంపకుఁ గాక యట్టి
    నిరుపమప్రజ్ఞ గలుగునే యెరులదయకు
    ద్రికరణాగోచరోరుశక్తిప్రభావ
    ప్రోవు మీబాలుఁ గరుణాప్రపూర్ణహృదయ.

అని యనేకప్రకారంబుల నయ్యతిచంద్రుడు ప్రార్ధించుటయు నావిప్రకుమారుండు నిద్రించి మేల్కొనునట్లే లేచి కూర్చుండెను. అప్పు డాప్రాంతమం దాయద్భుతము చూచినవారు శంకరాచార్యుని దైవప్రభావమును వేతెఱంగులఁ గొనియాడిరి ఆ బ్రాహ్మణదంపతులును శంకరాచార్యుఁ బ్రస్తుతించుచు నాపుత్రు నెత్తుకొని యింటికిం జని తద్వృత్తాంత మెల్లరకుఁ జెప్పిరి. శంకరాచార్యుండును నమ్మూకాంబ నిట్లు స్తుతియించెను.

శ్లో॥ అష్టోత్తరత్రింశతియాఃకలాస్తాస్త్వర్ధ్యాఃకలాః
     పంచనివృత్తిముఖ్యాః | తాసాముపర్యంబతవాంఘ్రిపద్మం
     విద్యోతమానంవిబుధాభజంతే
     యేప్రత్యభిజ్ఞామతపారవిజ్ఞాధన్యాస్తు తేప్రాగ్వివితాంగురూక్త్యా
     సైనాహమస్వీతి సమాధియోగాత్త్వాం ప్రత్య
     బిజ్ఞావిషయం విదఢ్యుః.
     శ్రీ చక్రషట్చక్రకయోః పురోధశ్రీ చక్రమన్వోరపిచింతి తైక్యం
     చక్రస్య మంత్రస్యతత స్తదైక్యంక్రమాదన ధ్యాయతిసాధకేంద్రః॥

అని పెక్కుభంగుల నమ్మహాదేవిని శ్రీచక్రయంత్రోద్ధారణప్రకారంబునం బ్రస్తుతిజేసి ప్రసన్నురాలిం జేసికొని యయ్యతిపతి యటఁగదలి శిష్యులతో నాప్రాంతమందుయున్న శ్రీబలియను నగ్రహారమునకుం జనియెను. అయ్యగ్రహారంబున నాహితాగ్నులును శ్రుతిపాఠకులు నిగమచోదితక్రియాతంత్రులునగు బ్రాహ్మణులు వేనవేలు గలిగియుండిరి. నిజకర్మనిష్టులు ప్రమాదశూన్యులునగు నందలి బ్రాహ్మణుల నియమమునకు వెఱచి యపమృత్యు వప్పురంబుఁ ప్రవేశింపనేరకున్నది. స్వాహావషట్కారనినందంబు లెల్లప్పుడు నప్పురంబున మ్రోగుచుండును. సకలకళానిలయంబగు నయ్యగ్రహారము శంకరుండు శిష్యులతోఁ బ్రవేశించినంత నంతకుమున్న తద్విఖ్యాతి వినియుండిరి కావున నందలి బ్రాహ్మణులు సగౌరవముగా నతని కెదుర్కొని పెక్కుతెఱంగులఁ గొనియాడుచు నాయకమణియుంబోలె నందు విరాజిల్లు పినాకపాణియాలయంబునం బ్రవేశపెట్టఁ దీసి