పుట:కాశీమజిలీకథలు-05.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

115

శ్లో॥ శ్రీమత్పయోనిధినివేశనచక్రపాణి
     భోగీంద్రభోగమణిరాజితపుణ్యమూర్తి
     యోగీశశాశ్వతశరణ్యభవాబ్దిపోత
     లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం॥

శ్లో॥ సంసారసాగరవిశాలకరాళకాల
     నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
     వ్యగ్రస్యరాగలసదూర్మినిపీడితస్య
     లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం॥

శ్లో॥ లక్ష్మీపతె కమలనాభసురేశవిష్ణో
     వైకుంఠకృష్ణమధుసూదనపుష్కరాక్ష
     బ్రహ్మణ్యకేశవజనార్దనవాసుదేవ
     లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం॥

అని తచ్ఛ్లోకంబులనెల్లఁ జదువుటయు నాలించి పద్మపాదాదు లత్యంతసంతోషముతో గురుప్రభావ మగ్గింపుచు నరగి యరగి యగ్గిరిశిఖరంబునకు జని యం దాచార్యవర్యుం గాంచి మేనం బులక లుద్గమింప నానందబాష్పములచేఁ గంఠంబు డగ్గుత్తిక బొరయ నరయముగాఁ దచ్చరణరాజీవంబుల కెరంగుటయు నమ్మహాత్ముండు వారినెల్ల లేవనెత్తి మన్నించుచుఁ బెద్దతడువ వారితో వియోగచింతాసంతాపంబు వాయ ముచ్చటించెను.

పదంపడి యయ్యతిపతి శిష్యులతోఁ గూడికొని సనందనాది యోగులం గూడిన సనకమహర్షియుంబోలె విరాజిల్లుచు యోగంబున నెగిరి యల్పకాలములో మండనమిశ్రుఁమందిర మలంకరించెను. అట్లాకాశమార్గమున వచ్చిన శంకరుం జూచి మండనమిశ్రుఁడు ప్రాంజలియై వినయమున నతిథిపూజ గావింపుచుఁ బాదంబులం బడి, మహాత్మా! మదీయగృహశరీరాదికములు నీ యధీనములు. నీకు నేను ప్రేష్యుండఁ గర్తవ్య ముపదేశింపుమని పలికెను. అప్పు డుభయభారితిచే నర్పింపబడిన శంకరయతిచంద్రుం జూచి మహాత్మా! నీవు పరమేశ్వరుండవు. నన్ను సభలోఁ గామశాస్త్రప్రసంగములో నోడింపక వాని నేర్చుకొనువాడుంబోలె మితిఁగోరి యరుగుట మర్త్యవిడంబన కాని నీ యెఱుంగనిది కాదు. నీచే మేము పరాజితులమైతిమని యించుకయు సిగ్గు వహింపము సహస్రకరునిచే నభిభవముఁ బొందుట చంద్రాదులకు నపకీర్తి హేతువగునా? నీవు సర్వేశ్వరుండవు నీ యెఱుంగనిదిలేదు. నేను సత్యలోకమున కరిగెద ననుజ్ఞ యిమ్మని పలికి యంతర్హితత్వము వహించియున్న యవ్విరించిపత్ని యోగశక్తిచే నవలోకించుచు నాభాష్యకర్త యిట్లనియె. దేవీ! నిన్ను విధాతపతివ్రతవైన వాగ్దేవతఁగా నెఱుంగుదు. నీవు చిత్స్వరూపిణివి. లక్ష్మ్యాదిరూపంబుల నీవ తాల్తువు నీ వాది