పుట:కాశీఖండము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12 శ్రీకాశీఖండము

క్రొత్తముత్తెములతో రుద్రాక్షమాలిక
లష్టోత్తరశతంబు లఱుతఁ దాల్చి
తే. పుండరీకాజినమునఁ గూర్చుండి శంభు
నర్చనముఁ జేయునపుడు మహాప్రమథుఁడు
చాల నొప్పారు రెండవశంభునట్లు
వీరనారాయణుం డల్ల వేమవిభుఁడు. 39

శా. చంచల్లీలకహస్తకంకణమణిచ్ఛాయల్ ప్రకాశింపఁ బూ
జించు న్వేమమహీవిభుండు నవరాజీవంబులం గల్వలన్
బ్రాంచత్కాంచనపుష్పకేసరములం బ్రాసాదపంచాక్షరిన్
మంచుంగొండయనుంగుఁబెండ్లికొడుకున్ మధ్యాహ్నకాలంబునన్. 40

వ. తదనుసంభవుండు. 41

ఉ. రాజశశాంకశేఖరుఁడు రాజకిరీటవతంస మష్టది
గ్రాజమనోభయంకరుఁడు రాజులదేవర రాజరాజు శ్రీ
రాజమహేంద్రభూభువనరాజ్యరమారమణీమనోహరుం
డాజిఁ గిరీటి కీర్తినిధి యల్లయవీరనరేంద్రుఁ డున్నతిన్. 42

మ. మనుతుల్యుం డగుకోటభూవిభుని వేమక్ష్మాతలాధీశునం
దనఁబాణిగ్రహణంబు చేసెఁ బ్రియ మొందన్ వీరభద్రేశ్వరుం
డనితల్లి న్వనితామతల్లి నుదయాస్తాద్రీంద్రసీమావనీ
ఘటసామ్రాజ్యసమర్థన ప్రతిమసాక్షాదిందిరాదేవతన్. 43

తే. అట్టియనితల్లి పుణ్యగుణాభిరామ
దనకుఁ బట్టంపుదేవిగా ధన్యలీల
వసుధయెల్ల నేకాతపవారణముగ
నేలు నల్లయవీరభద్రేశ్వరుండు. 44