పుట:కాశీఖండము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక 13

సీ. మకరకుండలదివ్యమాణిక్యదీప్తులు
చెక్కుటద్దములపై జీరువాఱ
డాకాలికండపెండారంబుదాపున
బొమ్మలై వైరిభూభుజులు వ్రేలఁ
గమియంగ నలఁదినకస్తూరినెత్తావి
యష్టదిక్కులయందు నవఘళింప
మొగము చూచినమాత్ర మూర్ధాభిషిక్తులు
మోడ్పుఁజేతులు మస్తముల ధరింప
తే. మెఱుఁగుఁదీఁగెలఁ బోలుభామినులు గొలువ
నిండుకొలువుండెఁ గన్నులపండు వగుచు
రాయవేశ్యాభుజంగవీరప్రతాప
విభవుఁ డల్లాడభూపతి వీరవిభుఁడు. 45

స్రగ్ధర. జంభారాతీభశోభాచకచకనిభముల్ శాంభవీయాట్టహాసా
రంభావష్టంభరేఖారభటలటహముల్ రాజరాజాద్రితేజ
స్సంభారభ్రాంతిదంబుల్ సకలభువనవీక్షాకరంభంబులయ్యున్
జృంభించున్ వీరభద్రక్షితిరమణయశశ్శ్రీవధూవిభ్రమంబుల్. 46

క. వేరీ ధరణిపు లల్లయ
వీరక్ష్మాపతికి సాటి వితరణగరిమన్
ధారాధరధారాధవ
ధారాధరవాహదానధారానిధికిన్. 47

సీ. గోదావరీపావనోదకంబుల హేమ
కలశీశతంబుల జలక మార్చుఁ
గర్పూరకస్తూరికాకుంకుమంబుల
గలపంబుఁ గూర్చి శ్రీగంధ మలఁదు