Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మద్యపానవర్ణనము

క.⁠

సంబోధకరము మదనా, లంబనము నశేషరసవిలసితము నంత
ర్బింబితవచనము నగు [1]కా, దంబరి నాపానమునకుఁ దగు నొడఁగూర్పన్.

⁠ 119


మ.⁠

అలినాదంబులు దాసమానములుగా నాలప్తి గావించుఁ [2]దొ
య్యలి యో ర్తొక్కెతె పాడు విశ్వవిభు నేలాదిప్రబంధంబులన్;
గైకొని యోర్తు సాంగముగ వర్తించుం; గళాసించు [3]ను
గ్మలి యో ర్తొక్కతె వ్రాలు సోలములతోఁ గాదంబరీ[4]గోష్ఠిచేన్.

⁠ 120

సురతవర్ణనము

తే.⁠

[5]తనరు నెనుబదినాల్గుబంధములయందు
నమరుఁ బ్రచ్ఛిన్నమును బ్రకటము ననంగ
సురతములు రెండు; [6]వానికి స్ఫురణసొంపు
వలయు వర్ణింప నిఖిలకార్యములయందు.

⁠ 121


సీ.⁠

పొలయల్కఁదలఁపులఁ బులకించుఁ, బులకించి బింకంపుఁగౌగిళ్ల బిగి భజించు
మరుచిన్నె లున్నెడఁ బరికించుఁ, బరికించి [7]చొక్కుఁ, జెమర్చినయిక్క లరయుఁ,
దొలిమ్రొక్కు చెలిచెవిఁ జిలికించుఁ, జిలికించి [8]మురిపెంపుసిగ్గున మూరిఁబోవుఁ,
బంజరంబున చిల్కఁ బలికించుఁ, బలికించి నొడువు లాలము లైన నోరు నొక్కు,

⁠


తే.⁠

సొబగుటడుగులలదుక చూచుఁ, జూచి
[9]యరిగి శయనీయ మారయ నప్పళించు,
వెలఁది యొక్కర్తు చాళుక్యవిభునిచేత
భావజాతుని గెల్చినభావ మొప్ప.

⁠ 122

విప్రలంభవర్ణనము

క.⁠

అచ్చపువెన్నెలచేఁ [10]గడు, వెచ్చుటలును మాన మెడలి వెడవిల్తునిచే
నొచ్చుటలును బ్రియుఁ డబ్బని, ముచ్చటలును విప్రలంభమునఁ జెప్పఁదగున్.

⁠ 123


ఉ.⁠

ఎల్లిద మయ్యెఁ దాల్మి, [11]తగ నెల్ల వివేకము వింత యయ్యె, మి
న్నెల్లను జంద్రుఁ డయ్యె, మన మెల్ల మనోభవుతూపు లయ్యె, మే
నెల్లను సన్న మయ్యెఁ, జెలు లెల్ల విరోధిన లైరి, విశ్వభూ
వల్లభుతోడియల్క గరువంపుఁజలంబునఁ బువ్వుఁబోఁడికిన్.

⁠ 124

ప్రయాణవర్ణనము

క.⁠

గజరథహయసూచిత మగు, [12]విజయమ్మున నుబ్బి నడుచు విశ్రుతవివిధ
ధ్వజిని వినుతించు టెప్పుడు, భజనీయము సుకవి సత్ప్రబంధములందున్.

⁠ 125


మ.⁠

కర ముద్యత్కరవాలభైరవపతాకాఖేలనం బై పరి
స్ఫురదుగ్రాయుధదీప్తిపూరితనభోభూభాగ మై సంచర

⁠
  1. ↑ క.గ.చ. కాదంబరి యావాసమునకు
  2. ↑ క.గ.చ. తొయ్యలి యోర్తొక్కతె
  3. ↑ క.గ.చ. ఉగ్మలి యొక్కర్తుక
  4. ↑ క.చ.గోష్ఠిలోన్, గ. గోష్ఠితోన్
  5. ↑ క.గ.చ. తనర నెనబదినాల్గు
  6. ↑ క.గ.చ. వాని విస్ఫురణసొంపు
  7. ↑ క. చెక్కు చెమర్చిన
  8. ↑ క.గ.చ. మురిపంపుసిగ్గున
  9. ↑ క.గ.చ. అలగి శయనీయము
  10. ↑ క కడుమెచ్చుటలును, గ.చ. కడువెచ్చటులును
  11. ↑ క. తగ వెల్లవివేకము. గ.చ. తగ వెల్లివివేకము
  12. ↑ క.గ.చ. విజయమునకు నుబ్బి