Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రోదయవర్ణనము

క.

మండలశోభయుఁ [1]గైరవ, షండవిలాసంబు జలధిసంజృంభణమున్
[2]గొండొకవెన్నెల గ్రోలెడు నండజములు విధుని[3]పొడుపునం దగుఁ బొగడన్.

111


మ.

[4]అదె రౌద్రాకృతిఁ జూచెఁ జంద్రుఁడు, మయూ[5]ఖాటోప మేపారె న
ల్లదె, మున్నాడెఁ జకోరసంఘ మదె జ్యోత్స్నాపానసంక్రీడకై;
యదయుం డంగజుఁ డెట్లు గాఁగలఁడొ? నీయాలోకనేందీవ[6]రా
పదఁ దూలించెదు, చంద్రవంశజుని నొప్పం జూతు రమ్మా సఖీ.

112

సూర్యోదయవర్ణనము

క.

ఎచ్చటఁ జూచిన జగముల, [7]నచ్చటన వెలుంగు ననియు నజ హరి [8]హర తా
సచ్చతురుఁ డనియు మఱియును, నిచ్చకుఁ దగఁ బొగడవలయు నిను నుదయంబున్.

113


మ.

కమలామోద మెలర్ప నేత్రసుఖదాకారంబు రంజిల్ల ను
త్తమవందారు శివంకరత్వ మెసఁగన్ ధర్మార్థకామక్రి[9]యా
దిమమూలం బన నొప్పుమిత్రుఁ డుదయోత్సేకప్రభావంబుచే;
సముఁ డద్దేవున కిందువంశజుఁడు తచ్చంచద్గుణశ్రేణులన్.

114

వనవిహారవర్ణనము

క.

[10]చారుతరచైత్రసంప, త్పూరితవిభవముల వేడ్క పొంగుడువడఁగా
నారీజనసహచరుఁ డై, యారామవిహార మొప్ప నధిపతి చేయున్.

115


సీ.

మానినీగండూషమధువులఁ బూచిన [11]పొగడను సొబగొప్పఁ బొగడి పొగడి
నారీపదాహతి ననిచినకంకేలి పరువంబు నగ్గించి పలికి పలికి
లలనావలోకనంబులఁ బుష్పితం బగు తిలకంబుపైఁ జూడ్కి త్రిప్పి త్రిప్పి
వనితోపగూహనంబునఁ బేర్చు[12]సురపొన్న మేలిపుణ్యమునకు మెచ్చి మెచ్చి


తే.

[13]మన్మథారామములపొంత మలసి మలసి
శుకపికాళివిహారంబు చూచి చూచి
సతులుఁ దానుఁ జరించు వసంతవేళ
బ్రమదవనమున విశ్వభూపాలవరుఁడు.

116

జలవిహారవర్ణనము

క.

నీరజములుఁ జెంగలువలు, కైరవములు వీచికలును గరయంత్రపయో
ధారలు నావర్తంబులు, వారివిహారంబులందు వర్జ్యము లరయన్.

117


చ.

[14]వళులును వీచికావళులు వారిరుహంబులు వక్త్రపంక్తులున్
చెలు వగు[15]నాభులున్ సుడులుఁ జేతులు రక్తసరోరుహంబులున్
జలదలకంబులున్ మధుపజాలము వీడ్వడఁ గేలి సల్పి [16]మిం
చులు గొనుచూడ్కులన్ సతులు సూతురు విశ్వనృపాలమన్మథున్.

118
  1. క.గ.చ. కైరవషండవికాసంబు
  2. క.గ.చ. కొండుక వెన్నెల గ్రోలెడు
  3. క. పొడవుదగుఁ బొగడంగన్, గ.చ. పొడవునందగుఁ బొగడన్
  4. క.గ.చ. అది రౌద్రాకృతిఁ దోఁచె
  5. క. ఆటోప మేపార
  6. క.గ.చ. ఆపదఁదూలించెడు
  7. గ.చ. నచ్చనయవెలుఁగు
  8. క.గ.చ. హరరాజచ్చరితుఁడు
  9. క.గ. ఆదిమమూలంబున నొప్పు
  10. గ.చ. చారుతరనేత్రసంపత్
  11. క. పొగడల సొబగొప్ప, గ.చ. పొగడల బాగొప్ప
  12. గ. సురవొన్నమేని
  13. క. మన్మథాంగావలుల, గ.చ. మన్మథాగావలుల
  14. క.గ.చ. వలలును వీచికావళులు
  15. క.గ.చ. నాభులున్ దిరులు చేతులు
  16. గ.చ. మించులు గనుచూడ్కులన్