Jump to content

పుట:కావ్యాలంకారచూడామణి (విన్నకోట పెద్దన).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్తురగోద్ధూతరజోతిధూసరహరిత్కూలంబు నై యుద్ధతిం
బరిభాసిల్లుఁ జళుక్యనాథుని చమూభద్రప్రయాణం బిలన్.

126

వివాహవర్ణనము

క.

ప్రచురస్వయంవరోచిత, రచనలుఁ [1]గన్యావరాభిరమ్యక్రియలున్
విచితశుభాత్మకవిధులును, రుచిరవివాహంబులందు రూపింపఁదగున్.

127


ఉ.

సంతతమంగళధ్వనులు చామరమౌక్తికపుండరీకముల్
వింతవిభూతి గా గురుకవిస్తుతివేళ వరించెఁ బొంత సా
మంతుల నుజ్జగించి [2]కడు మచ్చిక నెచ్చెలు లైన నీతి వి
క్రాంతులు చూపఁ గోరి జయకన్యక వచ్చి చళుక్యవల్లభున్.

128

పుత్త్రోదయవర్ణనము

క.

మిత్రానందోదయము న, మిత్రత్రసనంబు శుభనిమిత్తంబును స
త్పాత్రకృతవితరణంబును [3]బుత్త్రోదయమందుఁ దద్ద పొగడఁగవలయున్.

129


ఉ.

చిత్రము పోర విశ్వవిభుచే నసిపుత్త్రికఁ గన్నపుత్త్రు లు
ద్యత్త్రిదశాకృతిం బడసి యౌవనసంపదఁ జెంది మంగళా
మంత్రము లై వెలుంగునెడ మంజులయుక్తి దనర్చు దివ్యవా
దిత్రరవంబు నింపొదవుఁదెమ్మెరలున్ సురపుష్పవృష్టియున్.

130

మంత్రవర్ణనము

క.

అగవాక్షము నస్తంభము, [4]నగుగూఢాభ్యంతరముల హర్మ్యాగ్రమహా
[5]నగశృంగంబుల మంత్రము, దగు నొనరింపంగ ననుచుఁ దగు వర్ణింపన్.

131


మ.

అలుకం బోరికి [6]నెమ్మిమైఁ దరలుచోఁ బ్రారంభణోపాయమున్
బలసంపత్తియు [7]దేశకాలగతులున్ భంగప్రతీకారమున్
ఫలసంసిద్ధియు [8]నిర్ణయించు టనునీపంచాంగమంత్రక్రమం
బులు తర్కించుచళుక్యనాథు వెర వొప్పున్ బూజ్యరాజ్యక్రియన్.

132

దూత్యవర్ణనము

క.

ప్రతిభయుఁ బరమంత్రవిభే, దితయునుఁ బతిరక్తియును దితిక్షయు నిర్మూ
ర్ఖతయును [9]నవ్యసునీతియుఁ, జతురతయును [10]దూత్యమునను జను నుతియింపన్.

133


శా.

[11]ఉత్తేజుం డగువిశ్వభూవిభుని [12]దూత్యోదారసమ్యగ్గుణో
త్పత్తిన్ విశ్రుత మైనసంధి గనుభూపశ్రేణియున్ దుర్మదా
యత్త[13]స్వాంతత నిగ్రహించు [14]నరనాథౌఘంబె వర్తించు న
త్యుత్తుంగాచలచిత్రకూటములయందుం జెంది యశ్రాంతముల్.

134

సమరవర్ణనము

శ.

పటురథకరిహరిభటసం, ఘటిత[15]వ్యూహాదికములు ఘనఫలకాసి
[16]స్ఫుటరుచులు విజయకారణ, పటహాడంబరముఁ బొగడఁబడుఁ బోరాటన్.

135
  1. గ.చ. కన్యాపరాభిరమ్యక్రియలున్
  2. క.గ.చ. కడుమక్కువ నెచ్చెలులు
  3. క.గ.చ. పుత్త్రోత్సవవేళ
  4. క.గ.చ. అగూఢభిత్త్యంతరంబు
  5. క.గ.చ. నగశృంగంబున
  6. క.గ.చ. నెమ్మికిం గొరలుచో
  7. క.గ.చ. దేశకాలగతియున్
  8. క.గ.చ. నిర్ణయింపుడనునీ
  9. క.గ.చ. నవ్యసనితయు
  10. క.గ.చ. దూత్య మనఁగఁ జను
  11. క.గ.చ. ఉత్తేజంబగు
  12. క.గ.చ. దూతోదార
  13. క.గ.చ. స్వాంతత విగ్రహించు
  14. క. నరనాథౌఘంబు వర్ణించు, గ.చ. నరనాథౌఘంబ వర్తించు
  15. క.గ.చ. వ్యూహాదికముల
  16. క.గ.చ. స్పుటరుచుల