పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సభ్యముగఁ బఠనయోగ్యముగ నున్నది. పదునెనిమిదవ శతాబ్దమునాఁటి ప్రబంధములలోఁ గవిరాజమనోరంజనమువంటి సర్వాంగసుందరము రసవత్తరము నగు ప్రౌఢకావ్య మింకొకటి లేదను కవిచరిత్రకారుల వాక్యమునం దెంతయు సత్యము గలదు.

ఆంధ్రభాషయందుఁ గలలక్షణగ్రంథముల కైక్యము కానరాదు. ఒకరిసిద్ధాంతము నింకొకరు పూర్వపక్షముఁ జేసిరి. ఎవరిత్రోవ వారిది. ఈవిసృతలక్షణముల సమన్వయించుట యసాధ్యముగ నుండెను. ఒక రంగీకరించిన సిద్ధాంతము నింకొక లాక్షణికుఁడు పూర్వపక్షము గావించుచునుంటచే నానాఁటికవులకు నిశ్చయసిద్ధాంతములే తోఁచకుండెను. అందుచేతనే యీతనికవితలో వ్యాకరణలోపము లుండెనని కవిరాజమనోరంజనములోని యీ క్రిందిపద్యమువలన నెఱుంగనగును.

ఉ.

“చెల్లునటంచు నొక్కకవి చేసినలక్షణ మొక్కరీవలన్
జెల్లమిఁజేసి తారొకటే జెప్పఁగ ఛాందసవిస్తరంబు సం
ధిల్లుటఁ గావ్యశంక లవనిం దఱుచయ్యె రసజ్ఞులార నా
యుల్లఫుసౌధవీథిఁ గొలువున్న సరస్వతి సత్యవాణి నా
తల్లి యొసంగు పల్కులివి తప్పులుసేయక చిత్తగింపుఁడీ."

కవితాప్రౌఢి కిక్కవి యాంధ్రీస్తనముల నుపమానముగాఁ గైకొనినాఁడు. బహుశః ఇది అఱచాటగు నంధ్రవధూటిచొక్కపుంజనుఁగవను బేర్కొనువిధము గానోపు. ఆంధ్రీస్తనముల కాఠిన్యమును నన్నెచోళుఁడు రాజశేఖరుఁడు పేర్కొనిరి. అదియే కవిభావ మేని కవి శృంగారరసంబంధమునకుఁ గ్రొత్తవన్నెలు బచరించుటయే!

రసవత్తరమగు నీ గ్రంథరాజమునుండి దృష్టాంతముగ నీయఁదగినపద్యములు చాలఁ గలవు. రసికులముం దీ గ్రంథముంచి వారి నానందపఱచుటయే యుద్ధృతమునకంటె నుచితమగు పని. రచనాచమ