పుట:కవిరాజమనోరంజనము (కనుపర్తి అబ్బయ).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

త్కారమునను గూర్పుబింకమునను అనిరుద్ధచరిత్రముకంటె నీకవిరాజమనోరంజనము బ్రశంసాపాత్రముగ నున్నది.

చిరకాలముక్రింద చింతామణిముద్రణాలయమున నీగ్రంథము ముద్రితమైనది. అందు ముద్రణస్ఖాలిత్యములు కలవు. ప్రతులు చిక్కుటయే అసాధ్యముగ నుండెను. ఆంధ్రజనాదరపాత్రమగు నీగ్రంథరాజమునకుఁ గలప్రశస్తి గమనించి సర్వాంగసుందరముగ ముద్రించి ఆంధ్రలోకమునకు సమర్పించిన శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులుగారి యత్నము ప్రశంసనీయము.

ఇట్లు, భాషాసేవకులు,

శేషాద్రిరమణకవులు

శతావధానులు