పుట:కవిరాక్షసీయము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రాధ యను నతనిభార్యకు పుత్త్రుఁడై రాధేయుఁ డనఁబరఁగి దుర్యోధనునింటఁ బెరిఁగి యర్జునునకు విరోధియైనందున నింద్రుఁడు తన కొమరుఁ డగునర్జునునకు శుభము కలుగుటకై జయప్రదమైన యాకుండలములను వేఁడినప్పుడు దాని నిచ్చుటచే కర్ణునకు మహాదాత యనుపేరు గలిగె నని భారతకథ నిట ననుసంధించునది.


శ్లో.

వసన్నప్యవదాతానాం ద్విజానాం సవిధే సదా,
రాగాసుబన్ధమధరో న కదాచి ద్విముఞ్చతి.

6


వ్యా.

వసన్నితి. అవదాతానాం శుద్ధానాం, దైవ్ శోధన ఇత్యస్మా ద్ధాతోః కర్తరి నిష్ఠాద్విర్జాయంతే జన్మకర్మభ్యా మితి ద్విజాః. శ్లో. 'మాతు ర్యదగ్రే జాయంతే ద్వితీయం మౌంజిబంధనాత్, బ్రాహ్మణక్షత్రియవిశ స్తస్మా దేతే ద్వితా స్మృతా' ఇతి యాజ్ఞవల్క్యస్మరణా దితి భావః. తేషాం సవిధే సమీపే, వస న్నపి సదా అనవరతం, అధరః నికృష్టః, నీచాశ్రయవత్. రజ్యంతే మనో మనోరమా ఇవ ప్రతీయంత ఇతి రాగాః విషయాః తై రనుబధ్యత ఇత్యనుబంధః సంబంధః తం రాగానుబంధం, కదాచి త్కాలాంతరే౽పినవిముంచతి, 'సంసర్గజా దోషగుణా భవం'తీత్యేత న్మృషేతిభావః. అథవా రాగో మాత్సర్యం. ని. 'రాగో౽నురాగే మాత్సర్య' ఇతి విశ్వః తేన అనుబంధః దోషోత్పాదనం, ని. ‘అనుబంధః ప్రకృత్యాదౌ దోషోత్పాదే నరేశ్వర' ఇతి విశ్వః.


అన్యో౽ప్యర్థః

అవదాతానాం శుభ్రాణాం. ని. 'అవదాత స్సితే గౌర' ఇత్యమరః. ద్విజానాం దంతానాం. ని. 'దంతవిప్రాండజా ద్విజా' ఇత్యమరః. సవిధే సదా వస న్నపి అధరః ఓష్ఠః కదాచి దపి రాగేణ రక్తిమ్ణా అనుబంధం న విముంచతి.
త త్తస్య స్వాభావిక మిత్యర్థః.


టీ.

అధరః = నీచుఁడు, అవదాతానాం = పరిశుద్ధులైన, ద్విజానాం = బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులయొక్క, సవిధే = సమీపమందు, సదా = ఎపుడును, వసన్నపి = ఉండువాఁడైనను, కదాచిత్ = ఒకానొకప్పుడును, రాగానుబన్ధం = విషయాసక్తిసంబంధమును, =
నవిముఞ్చతి = విడువఁడు.


అర్థాంతరము.

అధరః = పెదవి, అవదాతానాం= తెల్లనైన, ద్విజానాం = దంతములయొక్క, సవిధే= చెంగటి, సదా= ఎప్పుడును, వసన్నపి = ఉండునదియైనను, రాగానుబన్ధం = ఎఱ్ఱదనముతోడిసంబంధమును, కదాచిత్ = ఒకానొకప్పుడును, నవిముఞ్చతి = విడువడు.


తా.

నీచుఁడగువాఁడు పరిశుద్ధులైన బ్రాహ్మణాదుల సమీపమందు సదావాసము చేయుచునుండినను దెలుపువన్నెగల పండ్ల సమీపమందుండు పెదవి యెవ్విధమున దన