పుట:కవిరాక్షసీయము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యా.

సత్స్వపి విద్వత్సు బహుషు దాతారో న బహవ స్సంతీత్యాహ - సఇతి. సః ప్రసిద్ధః కేవలః ఏకః. ని. 'కేవలః కృత్స్న ఏక శ్చే'తి శాశ్వతః కర్ణో రాధేయ
ఏవ అంగేషు దేశవిశేషేషు శ్రేయాన్, ఔదార్యత ఇతి యావత్ గణ్యతే కథ్యతే యః కర్ణః కుండలస్య సూర్యదత్తస్య వహనా ద్ధారణా త్ప్రకాశతే త్యాగే సతి న ప్రకాశతే అప్రకాశనం చ పరిపంథిగణాజేయతాభంగలక్షణహైన్యప్రయుక్తం. యద్వా - రాధేయః కుండలస్య త్యాగే యథాప్రకాశతే తథాసహనా న్నైవ ప్రశాశతే. 'తనిమ్నా శోభంతే గళికవిభవా శ్చార్థిషు నృపా' ఇతి భావః.


అన్యోప్యర్థః.

అంగేషు వపురాది ష్వవయవేషు మధ్యే ఏకః కేవలః కర్ణః శ్రవణ మేవ శ్రేయాన్ శ్రేష్ఠ ఇతి గణ్యతే - యః కర్ణః కుండలస్య కర్ణవేష్టనన్య వహనా త్ప్రకాశతే - తస్య త్యాగే సతి నైవ ప్రకాశతే.


టీ.

యః = ఎవఁడు, కుణ్డలస్య = సూర్యదత్త కర్ణాభరణముయొక్క, వహనాత్ = ధారణమువలన, ప్రకాశతే = శత్రువిజయముచే వెలుంగునో, త్యాగేన = విడుచుటచేత, నైవప్రకాశతే = ప్రకాశించఁడో, (లేక, కుణ్డలస్య వహనాత్ = కర్ణభూషణధారణమునకంటె, త్యాగేనైవ = దానిని విడుచుటచేతనే, ప్రకాశతే = వెలుంగుచున్నవాఁడో, సః = అట్టి, కేవలః = ఒకఁడైన, శ్రేయాన్ = ఔదార్యముచే శ్రేష్ఠుఁడైన, కర్ణ ఏవ = కర్ణుఁడే, అఙ్గేషు = అంగదేశమందు, గణ్యతే = ఎన్నఁబడుచున్నాఁడు.


అర్థాంతరము.

యః = ఏచెవి, కుణ్ణలస్య = కర్ణాభరణముయొక్క, వహనాత్ = ధారణమువలన, ప్రకాశతే = వెలుంగుచున్నదియో, త్యాగేసతి = విడువఁగా, నైవప్రకాశతే = వెలయదో, సః = అట్టి, కేవలః = ముఖ్యమైన, కర్ణఏవ = చెవియే, అఙ్గేషు = అవయవముల మధ్యమందు, ప్రకాశతే= వెలుఁగుచున్నది.


తా.

సకలశరీరావయవములును జెవిపోగులవలన నెట్లు మిక్కిలి ప్రకాశించుచున్నదో, యవ్విధమున దాతలగువా రనేకులుండినను, తాను జనించినపుడు సూర్యునిచే నియ్యఁబడిన సహజములైన కవచకుండలములుగల కర్ణుఁడు ఇంద్రునిచే యాచింపఁబడినవాఁడై తనకు జయము నొసంగుచు నలంకారమైయుండు కర్ణకుండలములను ఇంద్రునికి దానము చేసిన యారాధేయుఁ డొకఁడ అంగదేశమందు ప్రసిద్ధుఁడైనవాఁడు.

పూర్వమున, పాండురాజపత్నియైన కుంతిదేవి తనచిన్ననాఁడు దుర్వాసుఁ డనుముని నారాధించుచు ప్రసన్నుఁడగు నామునివలన నొకమంత్రమును బడసి యామంత్రమహిమ నెఱుంగవేఁడి సూర్యుని బిలిచిన నాతఁ డామెకోర్కి నెఱవేర్పఁగా, గర్భిణియై సిగ్గుచేతను భయముచేతను తాఁ గనిన శిశువును నదియందు పాఱవైచి చనినంత, సూర్యదత్తకవచకుండలములచే వెలింగెడి యక్కుమారుఁడు సూతుఁ డనువానికిఁ జిక్కి,