పుట:కవిరాక్షసీయము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గూఢాభిప్రాయః తస్యాస్పదత్వే నాశ్రయత్వేన అనాదేయవత్ అనుపాదేయ మివ భవేత్ తత్సారస్వతం కర్మ, సర్వే విద్వాంసః కవయః, న జానతే న విదుః - కేచిదేవ జానత ఇత్యర్థః, ‘ఆత్మనేపదేష్వనత' ఇతి ఝస్యా దాదేశః.


అన్యో౽ప్యర్థః.

యత్ సరస్వతీనామనదీ తస్యా ఇదం సారస్వతం త దమృతంజలంకర్తృ. ని. 'పయః కీలాలమమృత' మిత్యమరః. గూఢభావస్య గూఢత్వ స్యాశ్రయత్వేన, ఉపరిసికతావృతత్వాదితి భావః అనాదేవయత్ నద్యా ఇదం నాచేదేయం 'నద్యాదిభ్యో ఢ'గితి శైషికో ఢక్ - త న్న భవతి అనాదేయం తద్వత్ భవేత్ - తత్సారస్వతం నదీసంబం ధ్యమృతం, సర్వేకవయః సర్వే జలపక్షిణః, న జానతే కేచి దేవ హంసాదయో జానత ఇత్యర్థః.


టీ.

యత్ = ఏ, సారస్వతామృతం - సారస్వత =సరస్వతీ సంబంధమైన, అమృతం= కావ్యామృతము, గూఢ = రహస్యమైన, భావ = అభిప్రాయమునకు, ఆస్పదత్వేన = ఆశ్రయ మగుటచే, అనా చేదేయవత్ = గ్రహింపఁగూడనియట్లు, భవేత్ = అగునో, తత్ = ఆసారస్వతామృతమును, కవయః = విద్వాంసులు, సర్వే= అందఱు, నజాసనతే = తెలియరు.


అర్థాంతరము.

యత్ = ఏ, సారస్వతామృతం = సరస్వతీనదీసంబంధమైన నీరు, గూఢభావాస్పదత్వేన - గూఢభావ = రహస్యముగా లోపలనే ప్రవహించుచు పైని కనుపింపకుండుటకు, ఆస్పదత్వేన = ఆధారమగుటచే, అనాదేయవత్ = నదీసంబంధము కానిదివలె, భవేత్ = అగునో, తత్ =అట్టి సరస్వతీనదీజలమును, సర్వేకవయః = అన్ని జలపక్షులు, నజానతే = తెలియఁజాలవు.


తా.

గుప్తగామినియైన సరస్వతీనదియొక్క జలమును కొంగలు మొదలగు నన్నిజలపక్షులు దెలిసికొనక, హంసలు మొదలగుకొన్నిమాత్ర మేరీతిగాఁ దెలిసికొనుచున్నవో, అవ్విధమున గూఢములైన రసభావాదులను శ్లేషాదిగుణములుగల కావ్యామృతమును సామాన్యవిద్వాంసు లందఱు తెలిసికొనరనియు మంచిపండితులు కొందఱుమాత్రమే తెలిసికొందురనియు భావము. అనఁగా రహస్యమైన శ్లేషాదిగుణములుగల నాకావ్యము సామాన్యపండితులకుఁ దెలియదనుట. ఇచట సరస్వతీనది యన్ని నదులవలె ప్రవహింపక గంగాయమునలలో నంతర్భూతమై ప్రవహించుచున్నదని పురాణప్రసిద్ధము.


అవ.

విద్వాంసు లనేకు లుండినను దాత లట్లుండరని చెప్పుచున్నాఁడు—


శ్లో.

న ఏవ కేవలః కర్ణః శ్రేయా నఙ్గేషు గణ్యతే,
యః కుణ్డలస్య వహనా త్యాగేనైవ ప్రకాశతే.

5