పుట:కవిరాక్షసీయము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యా.

కావ్యం సుభగ మితి వివేకి ష్వేవ శోభత ఇత్యాహ - కల్యాణేతి. కల్యాణాని ప్రశస్తాని వర్ణానియేషాంతాని కల్యాణవర్ణాని తాని పదాని యస్యా స్సా తథోక్తా. తస్యాభావ స్తత్తాతాం. భిభ్రతీ వాక్ వాణీ, సదా, సర్వదా, సారసంగిషు గుణగ్రాహిషు, భ్రాంతానభవంతీ త్యభ్రాంతాః వివేకినః తేషువిషయే స్ఫురంతః విరాజమానాః గుణాశ్శ్లేషాదయో యస్యా. స్సాభవేత్ విద్వా నేవ విజానాతి శబ్దశక్తి మిత్యర్థః కథం? విద్యుత్తటి దివ. సా౽పి కల్యాణవర్ణపదతాం సువర్ణవర్ణాశ్రయతాం బిభ్రతీ సతీ ని. 'కల్యాణ మక్షరే స్వర్ణే కల్యాణం మంగళే౽పి చే'తి విశ్వప్రకాశః. ని. 'పదం వ్యవసితత్రాణస్థానలక్ష్మాంఘ్రి వస్తుష్వి'త్యమరః. సదా సారసంగిషు ప్రశస్తవృష్టిధారాసంబంధవత్సు అభ్రాంతేషు మేఘేషు, అంతశబ్దో౽త్ర స్వరూపవచనః, స్ఫురన్ గుణః పీతాదిః యస్యా స్సా భవతి.


టీ.

కల్యాణవర్ణపదతాం - కల్యాణ = శుభములైన, వర్ణ = అక్కరములుగల, పదతాం = పదములభావమును, బిభ్రతీ = వహించుచుండెడి, వాక్ = కావ్యమందలి పలుకు, సదా = ఎల్లపుడు, సారసంగిషు = గుణగ్రాహకులగు, అభ్రాన్తేషు = భ్రాంతులు కానివారి (వివేకుల) విషయమందు, స్ఫురద్గుణా - స్ఫురత్ = వెలుగుచుండెడి, గుణా = శ్లేషాదిగుణములుగలదియై, విద్యుత్ = మెఱుమువలె, స్యాత్ = ప్రకాశించుచుండును.


అర్థాంతరము.

కల్యాణవర్ణపదతాం - కల్యాణవర్ణ = బంగరువన్నెయొక్క, పదతాం = ఆశ్రయభావమును, బిభ్రత్ = భరించుచున్నదియై, సదాసారసంగిషు = శ్రేష్ఠములగు జల్లులను బొందియుండెడి, అభ్రాన్తేషు = మేఘములందు, స్ఫురద్గుణా -
స్ఫురత్ = ప్రకాశించుచుండు, గుణా = పచ్చవన్నె గల, విద్యుత్ = మెఱుమువలె, స్యాత్ = ప్రకాశించుచుండును.


తా.

బంగరురంగులను దురంగలించు మెఱుంగుతీవెలు మేఘములపై నెట్లు పచ్చనిరంగులచే వెలుంగుచుండునో, అట్లు మంచియక్కరంబుల పదంబులతో గూడిన సత్కావ్యములు ఎల్లపుడును గుణగ్రాహకు లగు వివేకులయందు శ్లేష ప్రసాదమాధుర్యాది గుణములతోఁ గూడినవియై ప్రకాశించును.


అవ.

ఇపుడు వివేకు లనేకులు పుట్టుట లేదని చెప్పుచున్నాఁడు—


శ్లో.

గూఢభావాస్పదత్వేన య దనాదేయవ ద్భవేత్,
సారస్వతామృతం సర్వే కవయ స్తన్నజానతే.

4


వ్యా.

ఇదానీం వివేకినో న బహవో విద్యంత ఇత్యాహ - గూఢేతి. యత్ సరస్వత్యాః వాగ్దేవతాయా ఇదం సారస్వతం తదేవామృతం సుధా కర్తృ, గూఢభావో