పుట:కవిరాక్షసీయము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యెఱ్ఱఁదనమును విడువదో, అవ్విధమున దనవిషయాసక్తిని విడువఁజాలఁడు. ఇట్లనుటచే సహవాసమువలన గుణములు వేఱగుననుమాట యబద్ధ మనియు, స్వభావగుణము నెవ్వఁడు విడువఁడనియు భావము.


శ్లో.

అలకాశ్చ ఖలా శ్చైవ మూర్ధ్ని భీరుజనై ర్ధృతాః,
ఉపర్యుపరిసత్కారే ప్యావిష్కుర్వన్తివక్రతామ్.

7


వ్యా.

భీరూణాం స్త్రీణాం జనైః మూర్థ్ని ధృతాః, అలకాః చూర్ణకుంతలాః, ఉపర్యుపరి సత్కారే౽పి, తైలాదినేతి శేషః వక్రతాం అనృజుత్వం, ఆవిష్కుర్వంతి. ఖలాః దుర్జనాః, భీరూణాం భయశీలానాం, జనైః మూర్ధ్ని ధృతా అసి ఉపర్యుపరి సత్కారే౽పి, ధనాదిభి రితి శేషః వక్రతాం దౌర్జన్యలక్షణం, ఆవిష్కుర్వంతి ప్రకటీకుర్వతే. ఉపర్యుపరీతి నిత్యవీప్సయో రితి ద్విర్భావః.


టీ.

భీరుజనైః = స్త్రీజనులచే, మూర్ధ్ని = శిరస్సునందు, ధృతాః = ధరింపబడిన, అలశాశ్చ = ముంగురులును, ఉపర్యుపరి = పైపైన, సత్కారే౽పి = తైలాదులచే నుపచారములు గలుగుచుండినను, వక్రతాం = వంకరదనమును, ఆవిష్కుర్వన్తి = కలుగఁజేయుచున్నవి.


అర్థాంతరము.

ఖలాశ్చ = దుర్జనులును, భీరుజనైః = భయపడెడిజనములచేత, మూర్ధ్ని = శిరసునందు, ధృతా అపి = ధరింపఁబడినవారైనను, ఉపర్యుపరి = పైపైన, సత్కారే౽పి =ధనాదులచే నుపచారము గలుగుచుండినను, వక్రతాం = దుష్ప్రభావమును, ఆవిష్కుర్వన్తి = ప్రకటించుచున్నారు.


తా.

చెలులచేత నూనె మొదలగువానిచే నుపచరించఁబడిన శిరమందలి ముంగురు లేలాగు దమవక్రభావమును విడువవో, అట్లే దుష్టులగువారు భయపడువారిచే నమస్కరించఁబడినవారై ధనాదులచే నాదరింపఁబడినవారైనను, తమస్వభావమగు దౌర్జన్యమును మానరు.


శ్లో.

గుణానార్తిం పరాం నీత్వా ధనినో ధన్వినో యథా,
నిఘ్నన్తి హృదయం దృప్తా విదుషాం విద్విషా మివ.

8


వ్యా.

గుణానితి, ధనినః ధనవంతః పురుషాః, దృప్తా ఉద్ధతా స్సంతః, గుణాన్ అమానిత్వాదీన్, పరా ముత్కృష్టాం, ఆర్తిం పీడాం, నీత్వా గుణాన్ దోషీకృత్యేత్యర్థః. ని. ‘ఆర్తిః పీడాధనుష్కోట్యో' రిత్యుభయత్రాప్యమరః. గత్యర్థత్వా న్నయతే ర్ద్వికర్మకత్వం తేషాం విదుషాం, హృదయం మనః, నిఘ్నంతి క్లేశయంతి. కథం? ధన్వినో యథా ధానుష్కా ఇవ, ధన్వన్శబ్దస్య వ్రీహ్యాదిత్వా దినిప్రత్యయః. 'ధన్వీతి వ్రీహ్యాది