పుట:కవిరాక్షసీయము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాఠా' దితి వామనః. తే దృప్తాః రణలాభా ద్ధృష్టా స్సంతః, 'దృపహర్ష మోహనయో' రిత్యస్మా ద్ధాతోః కర్తరి నిష్ఠా-గుణాన్ మౌర్వీః. ని. 'మౌర్వీ జ్యా శింజినీ గుణ' ఇత్యమరః. పరా ముత్తరాం ఆర్తింధనుష్కోటిం, నీత్వా ప్రాపయ్య, విద్విషాం హృదయం వక్షో నిఘ్నంతి విధ్యంతి.


టీ.

ధనినః = ధనముగలవారు, దృప్తాః సంతః = గర్వించినవారై, గుణాన్ = వినయాదిగుణములను, పరాం = హెచ్చైన, ఆర్తిం = పీడను, నీత్వా=పొందించి, ధన్వినో యథా = విలుకాండ్రవలె, విదుషాం = విద్వాంసులయొక్క, హృదయం = మనసును, విద్విషా = శత్రువులయొక్క, హృదయమివ = ఎదనువలె, నిఘ్నన్తి = తల్లడింపఁజేయుచుననారు.


అర్థాంతరము.

ధన్వినః = విలుకాండ్రు, దృప్తాస్సంతః = రణలాభముచే హర్షము గలవారై, గుణాన్ = అల్లెత్రాళ్లను, పరాం= శ్రేష్ఠమైన, ఆర్తిం = వింటికొప్పును, నీత్వా = పొందించి, ధనినోయథా = ధనవంతులువలె, విద్విషాం = శత్రువులయొక్క, హృదయం = ఎదను, విదుషాం = విద్వాంసులయొక్క, హృదయమివ = మనస్సునువలె, నిఘ్నన్తి = కొట్టుచున్నారు.


తా.

యుద్ధాపేక్షగల విలుకాండ్రు తమధనుస్సుల కొప్పులందు అల్లెత్రాళ్లును బొందించి శత్రువులహృదయములను భేదించునట్లు, ధనవంతులు గర్వించినవారై వినయాదిసద్గుణములను నశింపఁజేసి విద్వాంసుల మనసులను వ్యధపఱచుచున్నారు.


శ్లో.

కృపాణేన కథంకారం కృపణ స్సహగణ్యతే,
పరేషాం దానసమయే యస్స్వకోశం విముఞ్చతి.

9


వ్యా.

కృపాణేనేతి. కృపణః లోభి కృపాణేన కరవాలేన సహ ని. 'కరవాలః కృపాణవ'దిత్యమరః. కథంకారం? కథ మిత్యర్థః 'అన్యథైవ' మిత్యాదినాకరోతే ర్నిరర్థకాణ్ణముల్ప్రత్యయః. గణ్యతే కథ్యతే కృపణస్య కృపాణేన సామ్యాభిధాన మనుచిత మిత్యర్థః. తత్ర హేతు మాహ-యః కృపాణః, పరేషాం శత్రూణాం దానస్య విదారణస్య సమయే కాలే, స్వస్య కోశం పిధానం, విముంచతి. ని. 'కోశో౽స్త్రీ కుట్మలే ఖడ్గపిధానే౽ర్థౌఘదివ్యయో' రిత్యమరః. కృపణో హి పరేషాం అర్థినాం దానస్య వితరణస్య సమయే కాలే, స్వస్య కోశ మర్థౌఘం, న విముంచతీతి కృపాణా దపి కృపణస్య నికృష్ట త్వమితి ధ్వనిః.


టీ.

యః = ఏకృపాణము (కత్తి), పరేషాం=ఇతరులయొక్క, దానసమయే = విదారణసమయమునందు, స్వకోశం = తనయొరను, విముఞ్చతి = విడుచుచున్నదో, (అట్టి కత్తి) పరేషాం = ఇతరులకు, దానసమయే = ఇచ్చెడివేళలో, స్వకోశం = తనధన