పుట:కవిరాక్షసీయము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తాత్పర్యము.

పాలసముద్రమును దఱచునెడ నందు పుట్టిన చంద్రుని విషమును పరమేశ్వరుఁడు పరిగ్రహించి, చంద్రునిఁ దలయందు భూషణముగా నుంచికొని విషమును వెలిబఱచక యేతీరున తనకంఠమందే నిలిపికొనియెనో ఆప్రకారము నేర్పరి యగువాఁడు కావ్యములందు సౌకుమార్యమాధుర్యప్రసాదాదిగుణములను, అప్రయుక్తక్లిష్టాదికావ్యదోషములను తెలిసినవాఁడై గుణములను శిరఃకంపనపూర్వకముగా పొగడుచున్నాఁడనియు, దోషములను వెలిబఱుపక కంఠమందే యణఁచుకొనుచున్నాఁడనియుఁ దెలియవలయును. ఇట్లనుటచేఁ గవియు ప్రమాదవశమున నెందేని యప్రయుక్తాదికావ్యములను బ్రయోగించియున్నచో దానినిగన్న విద్వాంసుఁ డట్టిదోషములను చాటింపక గుణములనే గ్రహింపవలయుననియు, తాను తప్పులు లేక కావ్యమును జెప్పువాఁడను నహంకారమును జెప్పక తనతప్పులను మన్నింపవలయుననియు, పరమేశ్వరుని యుపమానపూర్వకముగాఁ జెప్పి పండితులను బ్రార్థించుచున్నాఁడు.


అవ.

ఇప్పుడు సత్కావ్యప్రశంసాముఖముగా కావ్యమును బ్రశంసించు చున్నాఁడు:—


శ్లో.

శబ్దశక్త్యైవ కుర్వాణా సర్వదానవ నిర్వృతిమ్,
కావ్యవిద్యా శ్రుతిగతా స్యా న్మృత స్యాపి జీవనీ.

2


వ్యా.

ఇదానీం సత్కావ్యప్రశంసాముఖేన స్వకావ్యం ప్రశంసతి — శబ్దేతి. శబ్ద శక్త్యా శబ్దానాం శక్తి ర్నామ వివక్షితార్థాభిధాయకత్వం తయా శక్త్యా, సర్వదా నవనిర్వృతిం, నవా చాసౌ నిర్వృతి శ్చేతి విశేషణసమాసః-తాం నవనిర్వృతిం, నూతనసుఖం, కుర్వాణా, కరోతే స్తాచ్ఛీల్యే చానశ్ ప్రత్యయః. కావ్యవిద్యా కావ్యం నామ 'సగుణౌ సాలంకారౌ దోషరహితే శబ్దార్థౌ' తా వేవ విద్యా సా కావ్యవిద్యా, శ్రుతిం కర్ణం, గతా, శ్రుతేతి యావత్. తథాభూతా సతీ, మృతశబ్దే నోపచరితవృత్త్యా మూడో లక్ష్యతే. జీవతీతి జీవనీ జీవయిత్రీ స్యాత్ అంతర్భావితణ్యర్థో౽యం కావ్యవిద్యా శ్రుతమాత్రా మూఢ మ ప్యానందయతి కిమంత రసికమి త్యపిశబ్దార్థః.


అన్యో౽ప్యర్థః.

శబ్దః శబ్దనం, ఉచ్చారణ మిత్యర్థః తస్య శక్త్యా మహిమ్నా హేతునా, సర్వేషాం దానవానాం రాక్షసానాం నిర్వృతిం పునరుజ్జీవనరూపం సుఖం, కుర్వాణా, కావ్యస్య శుక్రస్య విద్యా, సంజీవనీ విద్యే త్యర్థః. ని. 'శుక్రో దైత్యగురుః కావ్య' ఇత్యమరః. శ్రుతిగతా కర్ణే ఉపవిష్టా సతీ, మృతస్య మరణం ప్రాప్తస్యాపి, రక్షోబలస్యేతి శేషః. జీవనీ జీవయిత్రీ, స్యాత్. శుక్రః కదనే మృతా నసురాం త్సంజీవనీవిద్యయోజ్జీవయతీతి పురాణకథా శ్రూయతే.