పుట:కవిరాక్షసీయము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

కవిరాక్షసీయము

ఆంధ్రటీకాతాత్పర్యవ్యాఖ్యానసహితము

అవ.

కవి స్వాహంకారమును పరిహరించువాఁడై చెప్పుచున్నాఁడు:—


శ్లో.

గుణదోషౌ బుధోగృహ్ణ న్నిన్దుక్ష్వేళానివేశ్వరః,
శిరసా శ్లాఘతే పూర్వం పరం కణ్ఠే నియచ్ఛతి.
ప్రణమ్య లోకనాథో౽హం పార్వతీప్రాణవల్లభమ్,
టీకా మాన్ధ్రాత్మికాం కుర్వే కవిరాక్షస సత్కృతేః.

1


వ్యా.

కవి స్స్వౌద్ధత్యం పరిజిహీర్షు రాహ — గుణదోషావితి బుధ్యత ఇతి బుధ విద్వాన్, గుణః శ్లేషప్రసాదాదిః, దోషః అసాధ్వశ్లీలాప్రయుక్తాదిః, క్రూరకృత్యం తా వుభౌ గృహ్ణ న్సన్ పరిగృహీతవాన్ పూర్వం గుణం శిరసా శ్లాఘతే, శిరఃకంపన పూర్వం స్తౌతీ త్యర్థః. పరం దోషం, కంఠే గళే, నియచ్ఛతి స్థాపయతిన పక్తీత్యర్థః. ఈశ్వరః శివః, ఇందుక్ష్వేళౌ శశివిషే ఇన సో౽పి చంద్రమసం శిరసా ధత్తే విషంతు కంఠే ధృతవాన్ తథా మత్కావ్యస్థా న్గుణా న్గృహ్ణంతు దోషా న్న గృహ్ణం త్వితి కవి ర్విపశ్చితః ప్రార్థితవా నిత్యనుసంధేయమ్.


టీక.

బుధః = పండితుఁడు, గుణదోషా = గుణదోషముల రెంటిని,ఈశ్వరః = పరమేశ్వరుఁడు, ఇన్దుక్ష్వేళా వివ = చంద్రవిషములనువలెనే, గృహ్ణన్ = గ్రహియించినవాఁడై, పూర్వం = మొదటిదియగు గుణమును, శిరసా = తలచేత, శ్లాఘతే = కొనియాడుచున్నాఁడు. పరం = వెనుకటిదియగు దోషమును, కణ్ఠే = కుత్తుకయందే, నియచ్ఛతి = నిలుపుచున్నాఁడు.


అర్థాంతరము.

ఈశ్వరః = పరమేశ్వరుఁడు, ఇన్దుక్ష్వేళా = చంద్రుని విషమును, బుధః = విద్వాంసుఁడు, గుణదోషావివ = గుణదోషములనువలె, గృహ్ణన్ = తీసికొనినవాఁడై, పూర్వం = మొదటివాఁడగుచంద్రుని, శిరసా = శీర్షముచేత, శ్లాఘతే = కొనియాడుచున్నాడు. పరం = వెనుకటిదియగు దోషమును, కణ్ఠే = గొంతునందు, నియచ్ఛతి = నిలుపుచున్నాఁడు.