పుట:కవిరాక్షసీయము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈకవిరాక్షసీయమను ద్వ్యర్థికావ్యమునందు ప్రాయికముగా నుపమాలంకార శ్లేషాలంకారములే నిండియున్నవి. ప్రథమశ్లోకమున కుపమేయోపమాత్వము సిద్ధించెను. అద్దానిని కువలయానందమున నుపమాప్రకరణమం దుదహరించి యుండుటంబట్టి యారీతి కావ్యసమయమునకు భయమగునో యని వదలినాఁడ. అయినను, కొన్ని శ్లోకముల కావిధమైన టీకయే వ్రాయఁబడియున్నది. సంస్కృతకావ్యములందలి యన్వయ మాంధ్రటీకలం దొకానొకచో సమంజసముగా తోఁపదు. అట్టిశ్లోకము లనేకము లీకావ్యమందుఁ గలవు. అచ్చో నాయపరాధంబు క్షమించవలయు నని కోరెద. ఈకవికి కవిరాక్షసుండని పేరు గలుగుటకు, "సాక్షరేషు భవ తీహ జగత్యాం సర్వఏవ హృది మత్సరయుక్తః, సాక్షరం కవిజనేషు య దేనం లోక ఏష కవిరాక్షస మాహ” అనుశ్లోకమును వక్కాణింతురు.ఇచ్చో నాయభిప్రాయం బీగ్రంథావసానమునందుఁ దెలిపినాఁఁడను. ఇందేదేని దోషములుండునేని పండితులు సవరించి క్షమించెదరని ప్రార్థించెద.

గుడిబండ

ఇట్లు

1-12-1916

శ్రీనివాసపురము లోకనాథకవి