పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

యాస్థానకవియగు మంత్రిప్రగడ సూర్యప్రకాశకవి కృష్ణార్జునచరిత్రమునఁ గవిస్తుతులలో సూరకవి నిట్లు స్తుతించెను.

క.

అడిదమువంశాంబుధిరా
డుడు పతియన ధరణి వెలసి యుర్వీశులచేఁ
గడ మన్ననగొని యెన్నం
బడు సూరకవీంద్రుఁ దలఁతుఁ బటుగుణసాంద్రున్.

ఇట్టి పద్యములన్నియు సేకరించిచూడ, నాంధ్రకవులచరిత్రములో సూరకవి కొసంగవలసిన యున్నతస్థానమును గూర్చి యియ్యిఱువదియవ శతాబ్దమునందలి మనము చర్చించవలసిన యవసరము లేకుండఁ బూర్వకవులే యొకవిధముగా నిర్ణయించిరని యూహింపవలసియున్నది. పిండిప్రోలు లక్ష్మణకవి లంకావిజయమునందు రచించిన యొకపద్యములో సూరకవికి భీమకవి శ్రీనాథ రామలింగకవులతో సమానమైన స్థానమును గల్పించుచున్నాఁడు,

క.

తెలియువిను రామకవ్యా
దులు సూరకవిప్రముఖ పృథుప్రతిబావం
తులు భీమ శ్రీనాథుల్
వెలయఁగ నాకరణిఁ దిట్టలే రూఢమతిన్.

తిట్టుకవిత్వమునం దీ కవు లందరికంటఁ దాను ఆద్యుడని లక్ష్మణకవి యభిప్రాయము. కాని సూరకవి తిట్టు కంసాలి సుత్తెపెట్టు" అను పద్యపాదము లోకోక్తియై