పుట:కవిజనరంజనము (అడిదము సూరన).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శాపానుగ్రహసమర్థులును బ్రౌఢకవితాధురంధరులును శ్రీనాథాది మహాకవులలోఁ బరిగణింపఁబడిన యడిదము సూరకవి పదు నెనిమిదవ శతాబ్దమునాఁటివాఁడు. ఆంధ్రకావ్యచరిత్రమునందుఁ బ్రబంధకవిత్వప్రకరణము సూరకవి రచించిన కవిజనరంజనము తోడనే ముగియునలసియున్నది. ఎఱ్ఱనాదులచేఁ దిక్కన సోమయాజి తెఱంగునఁ దన సమకాలికమహాకవులచే నీ సూరకవియు మిక్కిలి పొగడ్తగన్న మేటి.

క.

రవి యెఱుఁగును భువితత్వము
భువిలోపల నుండు జనులఁ బోషించు సదా
శివుఁ డెఱుఁగు నాట్యతత్వము
కవితాతత్వంబు సూరకవియే తెలియున్.


క.

అంతా కవులము గామా
అంతింతో పద్యమైన నల్లఁగలేమా
దంతివి నీతో సమమా!
కాంతాసుమబాణ! సూరకవి నెఱజాణా!

ఇట్టి పద్యము లనేకము లున్నవి. ఇట్లు సమకాలికులే గాక తరువాతి వారుఁగూడఁ దమ తమ గ్రంథములందలి పూర్వకవిస్తుతులలో నీ సూరకవినిగూడ స్తుతించుచుండిరి. మాడుగుల సంస్థానాధీశ్వరుఁడైన శ్రీ కృష్ణభూపతి