పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళాపూర్ణోదయము

______:0:______

ద్వితీయాశ్వాసము



      శ్రీఖండాద్రి హిమాచల
      మేఖలికావిలసదపరిమితహయరింఖా
      లేఖితజయలాంఛన నృప
      శేఖర నంద్యాల నారసింహునికృష్ణా.

వ. అవధరింపు మన్విధంబునం గలభాషిణితోడ సంభాషించి యరుగుచు నారదుండు తనమనంబున.

చ. హృదయముఁవ్రే గొకింత శమియించెను జెల్వపుఁగొవ్వు పెంపునం,
      బొదలెడురంభకున్ సవతిపోరు ఘటించుట కంకురార్పణం,
      బిది యిటు గొంత చేసితి నపేక్షిత మంతయు నైన యట్ల యీ,
      సుదతియ చాలు దీనికి నసూయయు నున్నది మాట లారయన్.

క. ఎంచఁగ నాగమనమునకు
     నించుక చుట్టయిన నయ్యె నిది యోగ్యమ సా
     ధించుట కెవ్వారిని బో
     రించనిక్షణ మొక్కటియుఁ దరింపఁగ వశమే.