పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

416

కళాపూర్ణోదయము


 

చితె యంచుఁ దత్సమీ, పవిశద తారలం గుఱుతు పల్మరుఁ '
జెప్పుచు బోంట్లు తెల్పి తె,ల్పి వనిత చేతఁ గంటి సనిపించిరి
తత్పతి విన్చు రంజిలన్.80

వ. అంత.81

సీ. కలవుటకములు బూ రెలు తేనెతొలలు చా
పట్లు మం డెంగ లొబ్బట్లు వడలు
పుడుకులు సుకియలు కడియం పుటట్లు వె
న్న ప్పొలు వడియంబు లప్పడాలు
పొంగరంబులు సొజ్జ బూరె లౌఁగులు సేవే
లు క్కెర లరి సెలు చక్కిలములు
ఖర్జూరగోస్తనీకదళికా సహకార
ఫలములు కొబ్బెర పనసతొలలు

గీ.తేనియలు జున్ను మీఁగడ లాననాలు
పానకములు రసావళ్ళుఁ బచ్చడులును
నాజ్యములఁ బప్పుకూరలు ననుపమాస్న
మపుడు ప్రజ నెల్లఁ దనియి)చె నహరహంబు.82

ఉత్సా. సురుచిభక్యుభోజ్య లేహ్యచూష్య పేయ భేదముల్
ధరణి నెన్నిగలవు వానిఁ దగ ఘటించి యందు నే
వ్వరికి నెప్పు పెద్ది వలసే వారి కపుడ యది గరం
బరసి యిడుదు రెన్నఁ దరమె యచటిభోజసస్థితుల్.83