పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

417

సప్తమాశ్వాసము

  

వ. అది యట్లుండె సంత.84

సీ, వెలయ వియ్యా లంది వీడుకోళ్ళు గుడిచి
నరఁ బువుల్ ముడిచిన నాపసానీ
యొజ్జన మొనరింప నుచిత క్రమంబునఁ
బుణ్యాంగనల్ గడఁబ్రోలు సొచ్చి
పొలుపుమీజఁగ నాకబలికృత్యములు దీర్చి
యావధూవరుల నెయ్యంబుతోడఁ
బూర్ణకుంభాంతర స్వర్ణ రౌప్యంబు లొం
డొరులకంటె మునుపు నరయ వృత్తిఁ

గీ. బుచ్చుకొనుటకు నెచ్చెలు లెచ్చరింప
గరము లిడి యిరువురును నొక్కటియె దొరక్క
బెనఁగులాడుచుఁ జిఱునవ్వు లొనరఁ బులక
లడరఁ గనిరి మిధస్స్పర్శ నానుభవము.85

గీ. ఎల్లభంగులఁ జిత్ర యై యెసఁగునట్టి
సతి కళాపూర్ణరాజసంగతిఁ దనర్ప
జగతి కెల్ల మహాపర్వ మగుచుఁ బరఁగె
నప్పు డా వేళ మరుఁ డేఁచు టరిదిగాదె.86

క. అనుపమరూప శ్రీలం
బెను పొందెడు పెండ్లికూతుఁ బెండ్లికొడుకుఁ గ