పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

415

కళాపూర్ణోదయము


సప్తమాశ్వాసము.

 
ముత్తైదువలు దగ నెత్తుబంగరుపళ్ళే
ములపాలు దోయిళ్ళ ముంచి ముంచి
 
గీ. ప్రియుని చే వేగిరము నొకింతయును మించ
నీక సాటికి మాటికి నిందువదన
పొలుపుమీఱుంగఁ దలఁ బాలు వోయుకడఁక
చూపఱులచూడ్కి, కొక వింతసొబ గొన ర్చె76

ఉ. పొవకుఁ డగ్ర భాగమునఁ బ్రస్ఫుటకీలలఁ బర్వ లాజహో
మావసరోద్య తాంజలిఁ దదంగన శోభిలె నందుకోఁగ హ
స్తావళి యెత్తి యాడెడుగణాధిపుముగ్గులు చూచు వేడ్కనిం
పావహిలంగ మీఁదఁ జలి తాంజలి పట్టుభ వాని కై వడిన్
 
చ. అలరుచునాల తొంగి ప్రథమాగముపంపువలాజహోమము
జ్వలశిఖయందుసల్పుచును జాలఁగ నొప్పె సమీరలోలకో
మలనవమాలి కాలతిక మంజులపల్లవతల్లజోల్లస
లలితర సాలకోపరిగళత్కు సుమావళి నొప్పుచాడు వన్.


మ. చెలికత్తెల్ ధ్రువదర్శనంబుకొజుకుం జేముట్టి పల్మారు నె
తులిడంగా మొగ మెత్తెనొయ్యనఁ దదస్తోకత్రపా భారము
న్నెల దోర్డోడన పైకిఁ బుచ్చుకొనుచున్కింబోలె ఫ్రీడావతీ
తిలకం బాసతి నమ్ర భావముఁగ్రమో త్తీర్ణంబుఁగావించుచున్

చ. మీవులఁగ సూళ్ము మై మినుకుమిన్కు మటంచుఁ బ్రకాశ
మొందెడుం, ధువుఁ గనుఁగొంటెయల దెయరుంధతిఁ జూ