పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

404

కళాపూర్ణోదయము


ద్యోగంబు దెలిపి సుముహూర్తంబున సాక్షి తాంబూలాది
సముచిత శుభవర్తనంబులు నడపి రంత మంత్రిజనులు తద్వి
వాహోత్సవంబునకు సాయత్తపడం బురంబులోనఁ జూటిం
చిన,
57

సీ. ఎక్కడఁ జూచిన నిండ్లపై ఁ బసిఁడికుం
డలు క్రొత్తమెఱుఁ గిడి నిలు పునారు
నేవంకఁ జూచిన హిమవారితో గంధ
సారంబు కలయంపి చల్లువారు
నెచ్చోటఁ జూచిన నెలమి గోడలఁ దట్టు
పునుఁగు జవ్వాదియుఁ బూయువారు
నేదిక్కు ఁ జూచిన నింపుగా మణి వేది
కలు కమకస్తురి సలుకువారుఁ

గీ. బ్రేమఁ గప్రంపుమ్రుగ్గులు పెట్టువారుఁ
గలువడంబులు మేల్కట్లు గట్టు వారుఁ
బచ్చతోరణములు పొందుపఱచువారు
నై రహో రాత్రసంభ్రమం బలర జనులు.
58

ఉ. పెండ్లి నృపాలునింట నని పేరంటముల్ ప్రియ మొప్పఁ జెప్ప
నిం,డ్లిండ్లకు శోభ నాక్షతలు హేమపుఁ బాత్రలఁగొంచుఁ బెద్ద
పూఁ,బోండ్లు చరించి రాకులును బోఁకలుఁ గుంకుమపొళ్లు
నూనెయుం, బండ్లును గొంచు వాద్యపుశుభధ్వనితోఁ దగు
వారు వెంట రాన్.
59