పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

405

సప్తమాశ్వాసము.



 
సీ. కర్పూరమృగమదగంధసొరాదులు
విరివిగాఁ బసిఁడికొప్పెరలఁ గలిపి
మల్లికాకుందచంపక జాతివకుళాది
పుష్పముల్ హేరాళముగను గూర్చి
మంచి వాసనల వాసించిన నెలవ త్తి
బాగాలు రాసులువడఁగఁ బోసి
బంగారుచజపులప సమీంచుతమలపా
కులమావటాలు కొండలుగ నైచి

గీ. తత్తదధికారపురుషు లశ్యంతమోద
గరిమ నేవీధిఁ జూచినఁ గ్రందుకొనుచుఁ
బురములో గంధమాల్య తాంబూలముల న
శేషజనములఁ దనియంగఁ జేసి రపుడు.60

గీ. అయిదువతనంబు సుత సమృద్ధియును గలుగు
సతు శుభవేళ మంగళస్నా సవిధులు
నడపఁ దొడఁగిరి బహు వైద్య నాద మెల్ల
దెసల నెసఁగంగ మధురలాలసకు నంత.61

ఉ. కొత్త గ నల్కెఁ గస్తురిని గోమలి యొక్క తె యొక్క- వేదిక
న్ముళైపు మ్రుగ్గు వెట్టెనొక ముద్దియతద్దయు నేర్పుమోజఁగాఁ
బుత్త డిపెండ్లి పీఁట యొక బోటి రయంబునఁ బెట్టి దాని పై
నుత్త ర పుం జెబింగులుగ నొక్క తెగప్పె విశుద్భవస్త్రమున్.