పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

403

సప్తమాశ్వాసము


 
ర్య సనుమతింపఁ జేయఁ బ్రథమాగమముఖ్యులఁబ పెనల్వుక
ననషతిపూన్కి వారు దగుజాడను జెప్పిరి తద్వధూటికిన్.

వ. చెప్పి దీనికు త్తరం బెయ్యది చెప్పు మనుడు నప్పరమపతివ్రత
వారితో నిట్లనియె.
53

ఆ. చల్లఁదనముతోడ నెల్ల బంధువులకు
దత్తదుచితమధురతర గుణములఁ
జిత్తరంజనంబు చేయుట నభినవ
కౌముది యను పేరు గలిగే నాకు.
54

గీ. చంద్రకిరణభ వాప్సరో జాతిఁ బుట్టి
యట్టి పేరొంది వెలయు నే నకట యిపుడు
తగ సతుల కెల్ల సామాన్యధర్మ మైన
పతిమనోనుకూలతకును బాయఁ దెరువె.
55

క. కావున నన్నే మడి గేద
రావసుధాధిపున కేది యభిమత మదియే
నా వాంఛితంబు నిక్కువ
మీవృత్తాంతం దెలుపుఁ డేర్పడ నచటన్.
56

వ. అని పలికి వీడ్కొ లుపుటయు వారలు చని యావిధంబు భూ
విభునకు విన్న వించి తదీయని దేశంబున మదాశయునిగృహం
బున కేఁగి యాకళాపూర్ణమహా రాజునకుంగలిగినవివాహో