పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

298

కళాపూర్ణోదయను.


భద్రాసనం బ్రఖ్యాతి వహించి యుండు ని సర్వారో
గ్యదం బెప్పుడున్.164

క. తగ మేహనంబు పై స
వ్యగుల్ప మిడి దాని పైఁ దదస్యం బిడిగ
ట్టిగఁ గూర్చుండుట యోభ
వ్యగుణా ముక్తాసనాఖ్య మై పెంపొందున్.165

క. కొందఱు సిద్ధాసన మని
కొందఱు వజ్రాసను మని కొనియాడుదు 60
పొందఁగ దీనిని మఱియొక
కొందఱు గుప్తాసన మనుగొండ్రు మహాత్మా.166

చ. కరతలముల్ ధరిత్రిపయి గట్టిగ రెండును సూది వానికూ
ర్పరముల నాభిపార్శ్వములఁ బన్నడ నాని శరీర మెల్ల బ
రమున దుడలీలఁ గనుపట్టఁగఁ జక్కఁగఁ జాఁగి యుని -సు
మ్మరయ మయూర సంజ్ఞ మగు నాసస మోధరణీసుకో శస్తూ

గీ. ధరణి పై రెండు పాదము లొరయఁ జాచి
పాణులఁ దదగ్రములు బిగఁబట్టి నుదురు
జానువులఁ జేర్చి యున్కి యోసాధుచరిత
తాపసేంద్రులు పశ్చిమస్థాన మండ్రు.168

క. ఈయాసనములు మిక్కిలి
కొయలఘుత్వమును సకలగద నాశనముం