పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

297

???


గీ.చెప్ప రొకకొంద ఱూరుసుస్థితిగ నడుగు
దోయి యుత్తానముగ నిడి తొడలనడుమ
నట్ల పాణులు నిలిపి నాసాగ్రదృష్టి
యగుచు నునికి పద్మాసనం బండ్రు బుధులు.160

గీ.అనఘ తుదఁ జెప్పినట్టి పద్మాసనవిధి
యందుఁ జిబుకాగ్రమును హృదయమునఁ జేర్చి
రాజదంతమూలంబున రసన చేర్చి
వాయుకర్షణ మొయ్యనఁ జేయవలయు.161

క.కుడితొడపై వామపదం
బిడి యితరముమీఁద నితర మిడి నిశ్చలతం
గడుఁ గుదు రై కూర్చుండుట
పుడమిన్ వీరాసనాఖ్యఁ బొలుచు మహాత్మా.162

శా.అండాధస్స్థిత మైనరేఖయుభయోపాంతంబుల న్గుల్ఫముల్
రెండున్వీడ్వడఁజేర్చి బాహుయుగము న్వ్రేళ్ళుంగడుంజిక్కనై
యుండన్జానువులందుఁ బూంచి వివృతాస్యుం డై సనాసాగ్రవీ
క్షుం డైయుం డెడునట్టియాసనము మించు న్సింహసంజ్ఞాక మై.

మ.తనగుల్ఫంబులు రెండు నండయుగళాధస్సేవనీపార్శ్వవ
ర్తన నుండన్ ఘటియించి హస్తములఁ దత్పార్శ్వంబులత్యంతయ
త్ననిరూఢిం గ్రహియించి వర్తిలుట యోధర్మాత్మ