పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బొలు పెసఁగుకప్పురపుఁబలుకులకుఁ గోమలత
నెలకొనిన సౌరభముఁ జలువపసయం గో
మలతయును గలిగి జగముల మిగులఁ బెంపెసఁగు
మలయపవనంపుఁగొదమలకు మధురత్వం
బలవడిన నీడు మఱి కల దనఁగవచ్చుఁ గడు
వెలయఁగలయీసుకవిపలుకులకు నెంచన్.”

(కళాపూర్ణోదయము)

సీ.

"విశ్రామవిహతి గావింపక సారవ
                   త్సాహిత్యసౌమనస్యంబు లెఱిఁగి
సమయంబు దప్పక శ్రవణకఠోరంబు
                   లైనశబ్దముల నత్యాకులాత్మఁ
జేయక సత్పరిచితసుకుమార వా
                   క్సరళితాభిప్రాయఁ గా నొనర్చి
పదబంధశిథిలత వాటిల్లఁగా నీక
                   యేచందములయందు నేమరిలక


ఆ.

పరఁగుకవియు దోహకరుఁడును యశము దు
గ్ధమును బడయు నట్లు గానినాఁడు
కృతియుఁ దాఁపుమొదవుఁ గీర్తియుఁ బాలు నీ
కుంట కాదు హాసయోగ్యుఁ జేయు.”

(కళాపూర్ణోదయము)

సూరనరచన సురుచిర మైనది. సత్కావ్యములకుఁ వలసిన సకలసద్గుణమణిగణములు గలిగి యగ్రగణ్య మైనది.